Jio Electric Scooters : జియో ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేసాయోచ్.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. చూస్తే మతి పోవాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio Electric Scooters : జియో ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేసాయోచ్.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. చూస్తే మతి పోవాల్సిందే

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Jio Electric Scooter జియో ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేసాయోచ్.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. చూస్తే మతి పోవాల్సిందే

Jio Electric Scooters : టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. జియో కొత్తగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 ని భారతదేశపు సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు తక్కువ ఖర్చుతో నడవడమే కాకుండా, సరైన ధర, సాంకేతికత కలగలిపిన మోడల్‌గా నిలుస్తోంది. దీని ద్వారా రోజువారీ ప్రయాణాలను మరింత చౌకగా, సురక్షితంగా, ఆర్థికంగా మార్చే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది.

Jio Electric Scooters జియో ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేసాయోచ్ అదిరిపోయే ఫీచ‌ర్లు చూస్తే మతి పోవాల్సిందే

Jio Electric Scooters : జియో ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేసాయోచ్.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. చూస్తే మతి పోవాల్సిందే

Jio Electric Scooters లక్షలోపు వచ్చేస్తున్న జియో ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ స్కూటర్‌లో 3.2kWh లిథియం అయాన్ బ్యాటరీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80-100 కిమీ వరకు ప్రయాణ సామర్థ్యం, అలాగే IP67 డస్ట్, వాటర్ రిజిస్టెన్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, 4kW హబ్ మోటార్ ద్వారా 110Nm టార్క్‌ను అందిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్ లు అందుబాటులో ఉండటం వలన ప్రయాణం అవసరానుసారంగా మారుతుంది. స్మార్ట్ టెక్నాలజీ పరంగా 4G LTE కనెక్టివిటీ, రియల్ టైమ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, చోరీ నిరోధక అలెర్ట్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. జియో మార్ట్ యాప్ ద్వారా నేరుగా స్కూటర్‌ నుంచే కిరాణా షాపింగ్ కూడా చేయవచ్చు.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.70,000 నుండి రూ.80,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ వాహనాల కంటే తక్కువ నిర్వహణ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది. నెలవారీ ఛార్జింగ్ ఖర్చు కేవలం రూ.300-400, సంవత్సరానికి రూ.1,000-1,500 మధ్య నిర్వహణ ఖర్చు ఉంటుంది. ప్రభుత్వ EV సబ్సిడీలు, భీమా డిస్కౌంట్లు, రోడ్ ట్యాక్స్ మాఫీలు వల్ల ఖర్చులు మరింత తగ్గవచ్చు. హోం ఛార్జింగ్, జియో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు, పబ్లిక్ EV నెట్‌వర్క్‌లతో ఛార్జింగ్ సౌలభ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ స్కూటర్ పట్టణ వాసులకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది