Jio : జియో యూజర్లకు బంపర్ ఆఫర్… ఫోన్ లో 5జీ సేవలను పొందండి ఇలా !
Jio : ప్రస్తుతం మారుతున్న కాలంలో రోజురోజుకీ కొత్త టెక్నాలజీ వస్తుంది. టెలికాం దిగ్గజం అయిన రిలయన్స్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1న దేశంలో 5జీ సేవలను ప్రారంభించాడు. అయితే అన్ని టెలికాం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించలేదు. జియో కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో 5జీ సేవలను ప్రారంభించింది. అయితే తాజాగా హైదరాబాదులో కూడా 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు జియో తెలిపింది.
జియో హైదరాబాద్ తో సహా బెంగుళూరులో కూడా ఈ సేవలను ప్రారంభించింది. ఇదివరకే దేశంలో ముంబై, కలకత్తా, వారణాసి, ఢిల్లీ, చెన్నై లాంటి ముఖ్య నగరాలలో 5జీ నెట్వర్క్ వచ్చింది. తాజాగా హైదరాబాద్ బెంగళూరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ను అందుకుంటున్నట్లు జియో తెలిపింది. స్మార్ట్ ఫోన్లో 500 Mbps నుంచి 1Gbps స్పీడ్ తో జియో పనిచేస్తుందని తెలిపింది. ముందుగా ఫోన్లో n77/n78/n8/n5/n28 బ్యాండో కాదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్లో సెట్టింగ్స్ యాప్ కు పోయి వైఫై అండ్ నెట్వర్క్ పై క్లిక్ చేయాలి.
తర్వాత సిమ్మ్ అండ్ నెట్వర్క్ పై క్లిక్ చేయాలి. అక్కడ ప్రిఫర్డ్ నెట్వర్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక మీ ఫోన్ 5జి కి సపోర్ట్ చేస్తే స్క్రీన్ పై 2జీ/3జీ/4జీ/5జీ అని కనిపిస్తుంది. 5 జీ పై క్లిక్ చేస్తే ఆటోమేటిగ్గా యాక్టివ్ అయిపోతుంది. జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో భాగంగా ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా 1Gbps వేగంతో అన్లిమిటెడ్ 5జీ డేటాను వినియోగించుకోవచ్చు అని జియో తెలిపింది. అంతేకాకుండా 2023 కల్లా దేశంలో అన్ని చోట్ల 5జీ సేవలను విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో 5జీ సేవలు వ్యాప్తి చెందటంతో అనేక మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.