Komaki LY Pro : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఫీచర్స్ అదుర్స్ .. ధర కూడా తక్కువే ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Komaki LY Pro : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఫీచర్స్ అదుర్స్ .. ధర కూడా తక్కువే ..!!

Komaki LY Pro : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా కొత్త కోమకి ఎల్ వై ప్రో స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర 1,37,500 ఉంది. కంపెనీ ఇందులో డ్యూయల్ బ్యాటరీలను అమర్చింది. డ్యూయల్ చార్జర్ తో వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు. దాదాపుగా 5 గంటల్లో బ్యాటరీలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 March 2023,12:20 pm

Komaki LY Pro : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా కొత్త కోమకి ఎల్ వై ప్రో స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర 1,37,500 ఉంది. కంపెనీ ఇందులో డ్యూయల్ బ్యాటరీలను అమర్చింది. డ్యూయల్ చార్జర్ తో వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు. దాదాపుగా 5 గంటల్లో బ్యాటరీలు ఫుల్ అవుతాయి. ఈ కొత్త స్కూటర్ లో టీఎఫ్ టి డిస్ప్లే ఉంది.

Komaki LY Pro electric scooter features

Komaki LY Pro electric scooter features

ఆన్‌బోర్డు నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్స్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్ గంటకు 62 కిలోమీటర్లు వరకు వెళుతుంది. ఈ స్కూటర్లో యాంటీస్నిడి టెక్నాలజీ ఉంది. హిల్స్ పై ఈ స్కూటర్ స్కిడ్ కాకుండా ఉంటుంది. అలాగే 12 ఇంచుల ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.స్కూటర్‌లో 3000 వాట్ హబ్ మోటార్ ఉంది. 38 ఏఎంపీ కంట్రోలర్స్ ఉన్నాయి. పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Komaki LY Pro: డ్యూయెల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అదుర్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కి.మి వెళ్లొచ్చు!

ఎల్ఈడీ లైట్స్, అలాయ్ వీల్స్, టెలీ స్కోపిక్ ఫ్రంట్ సన్సెన్షన్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్, రిమోట్ కీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ నుంచి 180 కి.మీ వరకు వెళుతుంది.ఓలా ఎస్1, ఏథర్ 450 ప్లస్ జెన్ 3, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్కెట్లో చాలా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ధరను బట్టి రేంజ్, ఫీచర్లు మారుతాయి. 70 వేల నుంచి కూడా మంచి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది