Mibot Ev Car : కొత్త సూప‌ర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mibot Ev Car : కొత్త సూప‌ర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Mibot Ev Car : కొత్త సూప‌ర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..?

Mibot Ev Car : జ‌పాన్ కంపెనీ మిబోట్ పేరుతో మార్కెట్లో కొత్త కారుని లాంచ్ చేయ‌బోతుంది. హిరోషిమా సమీపంలోని చిన్న గ్రామంలో కెజీ మోటార్స్ అనే చిన్న కార్ల కంపెనీ గోల్ఫ్ కార్ట్ మిబోట్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ కారుతో జపాన్‌లో రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. మిబోట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువనే చెప్పాలి.

Mibot Ev Car కొత్త సూప‌ర్ కారు మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్ ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా

Mibot Ev Car : కొత్త సూప‌ర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..?

Mibot Ev Car : బెస్ట్ ఈవీ కారు..

ఫుల్ మోడ్రాన్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు. మిబోట్ ఈవీ కారు ధర దాదాపు రూ. 7 లక్షలు ఉండొచ్చు.ఫుల్ ఛార్జ్ చేస్తే.. మిబోట్ 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.చిన్న దూర ప్రయాణాలకు సరైనది.
ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు కేవలం 5 గంటలు సమయం పడుతుంది.గంటకు 60 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.కాంపాక్ట్ డిజైన్ గ్రామాల్లో ఇరుకైన దారులు, చిన్న రోడ్లకు సరిగ్గా సరిపోతుంది. తక్కువ దూర ప్రయాణానికి తక్కువ ధరలో కార్ల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారందరి కోసమే మిబోట్ అనే ఈవీ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్టు నివేదిక తెలిపింది. జపాన్‌లో కెయి కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. చిన్న కార్లు చాలా కాలంగా పాపులారిటీ పొందాయి. తేలికైన డిజైన్, కాంపాక్ట్ సైజు, ధర తక్కువ ఉండటంతో ఎక్కువగా సేల్ అవుతున్నాయి.2023లో దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో కెయి కార్లు 55శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇందులో నిస్సాన్ సాకురా అనే మోడల్ 2024లో 23వేల యూనిట్లను విక్రయించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది