New Rules : గ్యాస్ నుండి ఏటిఎం వరకు రేపటి నుండి అన్ని రూల్స్ మారుతున్నాయి.. తెలుసుకోకపోతే ఇబ్బందిలో పడతారు..!
New Rules : ఏప్రిల్ నెల నేటితో ముగియడంతో రేపటి నుండి మే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కీలకమైన మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు గ్యాస్ సిలిండర్ ధరల నుండి బ్యాంకింగ్ సేవలు, రైల్వే ప్రయాణ, ఎటిఎం విత్ డ్రా ఛార్జీల వరకు అనేక వాటిల్లో జరగబోతుంది. ముఖ్యంగా వంటింటి గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల మొదటి తేదీన సమీక్షించటం పరిపాటి. ఈసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉండగా, గత నెలలో ఇప్పటికే రూ.50 మేర పెరిగాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యులపై బారం పెంచనుంది.
New Rules : గ్యాస్ నుండి ఏటిఎం వరకు రేపటి నుండి అన్ని రూల్స్ మారుతున్నాయి.. తెలుసుకోకపోతే ఇబ్బందిలో పడతారు..!
అలాగే రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇకపై వెయిటింగ్ టికెట్ కలిగిన ప్రయాణీకులు స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించలేరు. ఈ నిబంధనలు మే 1 నుండి అమలులోకి రానున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఎటిఎం విత్ డ్రా ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు సార్లు ఎటిఎం విత్‌డ్రా ఫ్రీగా ఉండగా, నాలుగో సారి రూ.21 ఛార్జీ ఉండేది. కానీ మే 1 నుండి ఈ ఛార్జీ రూ.23కి పెరగనుంది. నగరాల్లో ఎక్కువసార్లు డబ్బు తీయాల్సినవారికి ఇది పెద్ద భారంగా మారనుంది.
ఇంకా FD మరియు సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించిన లోన్ల వడ్డీ రేటులోనూ మార్పులు ఉండొచ్చు. RBI ఇటీవల రెపో రేటును తగ్గించడంతో కొన్ని బ్యాంకులు ఇప్పటికే తమ వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి తక్కువ వడ్డీ లభించవచ్చు. అదే సమయంలో లోన్ తీసుకునేవారికి కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న బ్యాంకులను కలిపి పెద్ద బ్యాంకుగా మార్చే ప్రణాళికను ఆర్‌బిఐ చేపట్టింది. ఇది గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపనుంది. అందువల్ల మే 1 నుండి అమలులోకి వచ్చే ఈ మార్పులు ప్రజల జీవన విధానంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుండటంతో, అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
This website uses cookies.