
Simhachalam : సింహాచలం.. ప్రమాదానికి కారణం అదేనా.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..!
Simhachalam : విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయం సమీపంలో ఇటీవల నిర్మించిన గోడ కూలిపోవడంతో 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
Simhachalam : సింహాచలం.. ప్రమాదానికి కారణం అదేనా.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..!
ఈ దుర్ఘటన చందనోత్సవ సమయంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య కలకలం రేపింది. రూ. 300 టికెట్ క్యూ లైన్ కోసం ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ వద్ద చాలా మంది భక్తులు రాత్రి నిద్రలో ఉన్న సమయంలో, 2 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న కొత్త గోడ వర్షానికి కూలిపోయింది. గోడ కూలిన వెంటనే శిథిలాల కింద చిక్కిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ గోడను కేవలం 20 రోజుల క్రితమే నిర్మించారని అధికారులు పేర్కొన్నారు.
దీనివల్ల నిర్మాణ నాణ్యతపై తీవ్రమైన ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. కాంక్రీట్ బీమ్ లేకుండా 20 అడుగుల గోడను నిర్మించడం గమనార్హం. వర్షపు నీరు మట్టితో కలసి గోడపై ఒత్తిడి పెంచడంతో, ఆ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అధికారులు గోడకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో మరింత ప్రాణనష్టం తప్పినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయంపై కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.