Fastag : గుడ్ న్యూస్.. ఏడాదికి 3 వేలతో 200 ట్రిప్పులు.. దేశంలో ఎక్కడైనా..!
ప్రధానాంశాలు:
Fastag : గుడ్ న్యూస్.. ఏడాదికి 3 వేలతో 200 ట్రిప్పులు.. దేశంలో ఎక్కడైనా..!
Fastag : జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ఈ వార్షిక పాస్ పొందాలనుకునేవారు రూ.3000 చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Fastag : గుడ్ న్యూస్.. ఏడాదికి 3 వేలతో 200 ట్రిప్పులు.. దేశంలో ఎక్కడైనా..!
Fastag ఏడాదంతా..
ఈ పాస్ యాక్టివేట్ చేసుకున్న నాటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే, అప్పటితో పాస్ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని గడ్కరీ తన పోస్ట్‌లో వివరించారు.
దీని ద్వారా వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినప్పుడు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపింది. రూ.3 వేలు చెల్లించి పాస్ తీసుకోవచ్చని, దీని ద్వారా ఏడాదంతా 200 ట్రిప్పులు దేశంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ప్రయాణికుల నుంచి చాలాకాలంగా వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల టోల్‌ప్లాజాల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా టోల్ రుసుముకు సంబంధించిన వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయని అన్నారు.