Smartphone : ప‌దివేల‌లో నోకియా నుండి కొత్త ఫోన్.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Smartphone : ప‌దివేల‌లో నోకియా నుండి కొత్త ఫోన్.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..!

Smartphone : నోకియా.. ఈ బ్రాండ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతిలో నోకియా ఫోన్స్ ఉండేవి. ‘నోకియా 3210’ మోడల్‌ను మనం మరచిపోగలమా ? మనలో చాలా మందికి నోకియా 3210ని లగ్జరీ ఫోన్‌గా ఉపయోగించిన రోజులు గుర్తుండే ఉంటాయి. ఈ ఫోన్‌లోని స్నేక్ గేమ్ ఎవరూ మర్చిపోలేరు. ఆ త‌ర్వాత నోకియా నుండి చాలా ఫోన్స్ వ‌చ్చిన కూడా నోకియా 3210కి మాత్రం చాలా పాపులారిటీ ద‌క్కింది. అయితే ఇప్పుడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Smartphone : ప‌దివేల‌లో నోకియా నుండి కొత్త ఫోన్.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..!

Smartphone : నోకియా.. ఈ బ్రాండ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతిలో నోకియా ఫోన్స్ ఉండేవి. ‘నోకియా 3210’ మోడల్‌ను మనం మరచిపోగలమా ? మనలో చాలా మందికి నోకియా 3210ని లగ్జరీ ఫోన్‌గా ఉపయోగించిన రోజులు గుర్తుండే ఉంటాయి. ఈ ఫోన్‌లోని స్నేక్ గేమ్ ఎవరూ మర్చిపోలేరు. ఆ త‌ర్వాత నోకియా నుండి చాలా ఫోన్స్ వ‌చ్చిన కూడా నోకియా 3210కి మాత్రం చాలా పాపులారిటీ ద‌క్కింది. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి నోకియా జీ42 పేరుతో 5జీ ఫోన్ వ‌చ్చింది. ఈ మూవీ ధర చాలా త‌క్కువే అని చెప్పాలి. తక్కువ ధ‌ర కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

Smartphone తక్కువ ధ‌ర‌లో..

నోకియా జీ 42 5జీ ఫోన్‌ అసలు ధర రూ. 12,999కాగా అమెజాన్‌లో 23 శాతం డిస్కౌంట్‌తో ర. 9,999కి ద‌క్కుతుంది. ఇక అమెజాన్ పే బ్యాలెన్స్ తో పే చేస్తే రూ. 300 క్యాష్‌బాక్‌ లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ను మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్‌ చేసుకుంటే గ‌రిష్టంగా రూ. 9,450 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇంక ఇందులో ఉన్న ఫీచ‌ర్స్ గ‌మ‌నిస్తే.. 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్‌ 480 ప్లస్‌ 5జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 50000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మ‌రోవైపు ఇందులో లిథియం పాలిమార్‌ బ్యాటరీ ఉంటుంది. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ, 3.5 ఎమ్‌ఎమ్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ని ఒక్క‌సారి చార్జ్ చేస్తే 26 గంటల టాక్‌ టైమ్‌ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

Smartphone ప‌దివేల‌లో నోకియా నుండి కొత్త ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

Smartphone : ప‌దివేల‌లో నోకియా నుండి కొత్త ఫోన్.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..!

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్‌ ఏఐ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్‌, 2 ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్‌ అప్‌గ్రేడ్‌, ఏడాది మ్యానిఫ్యాక్చరింగ్ వారంటీ కూడా కంపెనీ అందిస్తున్నారు. మంచి ఫీచర్స్‌తో త‌క్కువ ధ‌ర‌లో ఫోన్ కొనుక్కోవాల‌ని అనుకునేవారు ఈ ఫోన్ ఎంపిక చేసుకుంటే బెట‌ర్.ఇక ఇదిలా ఉంటే నోకియా 3210 పాత మోడల్ ని కొత్త మార్పులతో ప్రవేశపెట్టింది. కానీ డిజైన్‌తో సహా ఆ పాత కళ దెబ్బతినలేదు.ఈ ఫోన్ 3 కలర్స్ అప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది