CM Revanth Reddy : కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు.. సీఎం రేవంత్ ని లెక్క చేయన్ మంత్రులు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు.. సీఎం రేవంత్ ని లెక్క చేయన్ మంత్రులు..?

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు.. సీఎం రేవంత్ ని లెక్క చేయన్ మంత్రులు..?

CM Revanth Reddy : ప్రత్యేక తెలంగాణ తర్వాత 10 ఏళ్లకు గానీ అధికారంలోకి వచ్చిన కాంగ్ర్స్ పార్టీ వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగ పరచుకోవడంలో దారి తప్పుతుంది. 2018 లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పార్టీ పగ్గాలు రేవంత్ కి ఇచ్చి పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచేలా చేశారు. ఐతే ఇంత చేస్తున్నా కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారన్నది ఇన్నర్ గా వినిపిస్తున్న మాట. ఎవరో కాదు సొంత మంత్రులతోనే రేవంత్ రెడ్డికి సఖ్యత లేదని కొన్ని విషయాలను చూస్తే అర్ధమవుతుంది. మార్చి నెలలో కొందరిని చైర్మన్లుగా నియమించినట్టుగా ఆదేశాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రహుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదు. కొందరు మత్రులు ఐతే రేవంత్ రెడ్డి ప్రకటనలపై మరో వాదన వినిపిస్తున్నారు.

CM Revanth Reddy రేవంత్ ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మంత్రులు

మధ్యం టెండర్లనే రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని కొత్త కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రతి పక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆ అనుమతులను రద్దు చేశారు. ఐతే ఈ అనుమతి రద్దు తాత్కాలికంగానాలేదా శాశ్వతమా అన్నది తెలియాల్సి ఉంది. బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద విమర్శలు చేశారు. ఎక్సైజ్ రెవెన్యొఇపై సీఎం రేవంతొకలా ప్రకటన చేస్తే ఆ శాఖ మంత్రి మరోలా స్పందించారని దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇవాలని క్రిషాంక్ అన్నారు. ఓ పక్క రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి ఇదంతా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నమే అంటున్నారు కోరుట్ల బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే సంజన్ కల్వకుంట్ల. తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి అభద్రతా భాంతో ఉన్న సీఎం ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

CM Revanth Reddy కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు సీఎం రేవంత్ ని లెక్క చేయన్ మంత్రులు

CM Revanth Reddy : కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు.. సీఎం రేవంత్ ని లెక్క చేయన్ మంత్రులు..?

ఎక్సైజ్ పాలసీ, కార్పొరేషన్ చైర్ పర్సన్ నియామకాలు ఇలా కాంగ్రెస్ పార్టీ లో ఏ నిర్ణయం కూడా సజావుగా జరగట్లేదనే విషయాన్ని గుర్తు చేశారు. అంతర్గత విభేధాలతో కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం కుదరడం లేదని అన్నారు. సీమె రేవంత్ తరచుగా ఢిల్లీ వెళ్లడం ఎందుకని ఆయన అన్నారు. పార్టీలో జరుగుతున్న విషయాల పట్ల హైకకాండ్ ఏం చెబితే అది చేస్తున్నారని అన్నారు. అంతేకాదు చాలమంది మంత్రులు రేవంత్ కి వ్యతిరేకంగా ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు సంజయ్.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది