Telugu States CMs : సీఎం లతో పాటు గవర్నర్లు, ప్రతిపక్ష నేతలు కూడా .. రాష్ట్రాల పంచాయితీ తేలే మార్గం లేదా.. ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి..?
ప్రధానాంశాలు:
Telugu States CMs : సీఎం లతో పాటు గవర్నర్లు, ప్రతిపక్ష నేతలు కూడా .. రాష్ట్రాల పంచాయితీ తేలే మార్గం లేదా.. ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి..?
Telugu States CMs : ఆంధ్రా నుంచి తెలంగాణా విడిపోయి పదేళ్లకు పైగా అవుతుంది. ఐతే విభన చట్టం కింద కొన్నేళ్లు ఏపీకి సంబందించిన భవనాలు తెలంగాణాలో ఉంచారు. ఐతే ఈ పదేళ్లలో లెక్క తేలాల్సిన ఈ పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పదేళ్లు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు ఆ విషయం మీద పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం వల్ల ఇలా జరిగింది.10 ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఈ రాష్ట్రాల పంచాయితీ తెగలేదు. బి.ఆర్.ఎస్ అధికారం లో ఉన్నప్పుడే దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉన్నా అది జరగలేదు. అంతేకాదు ఇప్పుడు ఏపీలో, తెలంగాణాలో ప్రభుత్వాలు మారాయి కాబట్టి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలైనా ఈ విషయంపై చొరవ చూపిస్తే బాగుంటుంది.
Telugu States CMs సీఎం లతో పాటు గవర్నర్లు, ప్రతిపక్ష నేతలు కూడా
రాష్ట్ర విభన చట్టం కింద కొన్ని ఏపీ ఆస్తులు, భవనాల లెక్కలు అలానే ఉండిపోయాయి. ఐతే పదేళ్ల లో వీటిపై ఒక స్పష్టత రావాల్సి ఉన్నా అలా జరగలేదు. ఐతే కేవలం ఇద్దరు సీఎం లు కూర్చుంటే ఈ విషయం ఒక కొలిక్కి వచ్చేలా కనబడటం లేదు. రాష్ట్ర గవర్నర్లు , ఇంకా ప్రతిపక్ష నేతలు కూడా విభన పంచాయితీల గురించి వారి అభిప్రాయాన్ని తెలిపితేనే మళ్లీ మళ్లీ రాబోయే రోజుల్లో దీనిపై మాట్లాడే అవకాశం ఉండదు.
తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ ఈ రెండు కలిసి రాష్ట్ర విభన టైం లో ఇంకా ఒక కొలిక్కి రాని విషయాల మీద చర్చించేందుకు సిద్ధం అవుతున్నాయి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి త్వరలో ఈ విషయంపై ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నారు. ఐతే రాష్ట్ర విభజన అంశాల్లో తెలంగాణ ప్రజలకు రాష్ట్రానికి నష్టం కలిగించేలా చేయకూడదని బి.ఆర్.ఎస్ అభిప్రాయపడుతుంది. అందుకే ఇలాంటివి ఏపీ నుంచి కూడా రాకుండా అధికా పార్టీ, ప్రతి పక్షం తో పాటుగా ఇరు రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ చర్చల్లో పాల్గొంటే సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.