Ola Electric Car : ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ కారును రూపొందించే పనిలో ఉంది. ఎలక్ట్రిక్ బైక్స్ తో ఎంతో పాపులర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కార్ ను తయారు చేస్తుంది. ఇటీవలే ఈ విషయాన్ని ఓలా ప్రకటించింది. 2024లో ఈ ఎలక్ట్రిక్ కార్ ను విడుదల చేయాలని ఓలా టార్గెట్ పెట్టుకుంది. అయితే ఈ కార్ ప్రీమియం రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ధర వివరాలను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు అని సమాచారం బయటకు వచ్చింది. అలాగే మరిన్ని వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ కార్ ధర ఎంత ఉంటుందని సంకేతాలను పీటిఐతో భవిష్ అగర్వాల్ వెల్లడించారని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కార్ ధర 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుందని అగర్వాల్ చెప్పారని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్టుల రేంజ్ లక్ష బైక్ నుంచి 40-50లక్షల ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ ఉంటుందని ఆయన వెల్లడించారని తెలిపింది. మిడ్, స్మాల్, ప్రీమియం ఎలక్ట్రిక్ కార్స్ విభాగంలో గ్లోబల్ లీడర్ గా ఎదగడమే కంపెనీ లక్ష్యమని భవిష్ అగర్వాల్ అన్నారు. ఇండియా తో పాటు గ్లోబల్ గాను వివిధ దేశాలకు సూట్ అయ్యేలా కార్లను తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ కార్ భారత్లో అత్యంత ఫాస్టెస్ట్ ఫోర్ స్పోర్టియెస్ట్ ఈ కార్ గా ఉంటుందని మార్కెట్ పై తమకు స్పష్టమైన అవగాహన ఉందని భవిష్ అన్నారట. తొలి ఎలక్ట్రికల్ కార్ ను 2024లో తీసుకొస్తామని ఈనెల 15వ తేదీన జరిగిన ఎస్1 బైక్ లాంచ్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ కార్ భారత్ లో ఒకానొక ఫాస్టెస్ట్ కార్ గా ఉంటుందని తెలిపింది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి ఈ కారు నాలుగు సెకండ్లలో చేరుకుంటుందని తెలిపింది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ టీజ్ చేసింది. గ్లాస్ రూఫ్ తో ఈ కారు వస్తుందని,మూవ్ ఓఎస్(Move OS) సాఫ్ట్వేర్ పై నడుస్తుందని ప్రకటించింది. అసిస్టెడ్ డ్రైవింగ్ సామర్థ్యం, కీలెస్ హ్యాండ్ లెస్ డోర్స్ తో ఓలా తొలి ఎలక్ట్రిక్ కార్ వస్తుందని ధ్రువీకరించింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైక్ ను రూ.99,999 ధరకు ఓలా గతవారం లాంచ్ చేసింది. 2021లో ఓలా ఎస్1 ప్రో లాంచ్ కాగా ఇప్పుడు దాని కంటే తక్కువ ధరకు ఎస్1 తీసుకొచ్చింది. మూవ్ ఓఎస్2 ఆపరేటింగ్ సిస్టం ఈ బైక్ లో ఉంటుంది. ఓలా ఎస్1 టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు గా ఉంది. 3kWh బ్యాటరీతో ఓలా ఎస్1 బైకు వస్తుంది. ARAI రేంజ్ 141 కిలోమీటర్లు కాగా నార్మల్ రేంజ్ 101 కిలోమీటర్లు ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ మోడ్ లో 128 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని ఓలా తెలిపింది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.