Karthikeya 2 : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు కేవలం మూడు వారాల వ్యవధిలో వచ్చిన బింబిసార.. సీతారామం మరియు కార్తికేయ 2 సినిమా లు భారీ వసూళ్లను నమోదు చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కలిసి ఏకంగా 250 కోట్ల వసూళ్ల వరకు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మూడు సినిమా ల్లో కార్తికేయ 2 సినిమా ను తోపు సినిమా గా ప్రేక్షకులతో పాటు అంతా కూడా చర్చించుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డ్రై వాతావరణం ఉంది అనుకుంటూ ఉండగా ఈ మూడు సినిమాలు వచ్చి కుమ్మేశాయి. మంచి కంటెంట్ తో వస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ ఈ సినిమాలు నిరూపించాయి.
తెలుగు సినిమాలు సాధిస్తున్న విజయాలు చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. బింబిసార కాకుండా కార్తికేయ 2 మరియు సీతారామం సినిమా లు హిందీలో కూడా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా హిందీ లో సాధిస్తున్న వసూళ్లను చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ దాదాపుగా 20 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది. తక్కువ సమయంలో స్క్రీన్స్ పెంచుతూ పోయి ఏకంగా 800 షో లు ఒక్క రోజు హిందీ వర్షన్ పడింది అంటే కార్తికేయ 2 సినిమా ను అక్కడి ప్రేక్షకులు ఎంతగా ఆధరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు..
ఈ మూడు సినిమాలతో పోల్చితే కచ్చితంగా కార్తికేయ 2 సినిమా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. హిందీలో అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అలాంటి సమయంలో కేవలం 50 స్క్రీన్స్ తో మొదలైన ప్రస్థానం కాస్త పాతిక కోట్ల వైపుకు దూసుకు పోతుంది అంటూ కార్తికేయ 2 ను ఎంత పొగిడినా తక్కువే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వర్గాల వారు కార్తికేయ 2 సినిమా మరో వారం రోజుల్లో వంద కోట్ల వసూళ్లు సాధిస్తుంది అంటూ నమ్మకంగా చెబుతున్నారు. కేవలం హిందీ వర్షన్ సినిమాకు పెట్టిన ఖర్చు మొత్తం రాబట్టింది. త్వరలోనే ఇతర సౌత్ భాషల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.