Karthikeya 2 : నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా వంద కోట్ల దిశగా దూసుకు పోతుంది. కార్తికేయ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ కోసం చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కార్తికేయ 2 సినిమా ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుంది. కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమా విడుదల అయ్యింది. సినిమా కథ మొత్తం కూడా శ్రీకృష్ణుడి చుట్టు తిరుగుతూ ఉంటుంది. సినిమా ను ఒక ఆసక్తికర నోడ్ లో దర్శకుడు తీసుకు వెళ్లడంలో సఫలం అయ్యాడు. అందుకే మంచి సక్సెస్ ను దక్కించుకుంది.
ముఖ్యంగా ఈ సినిమా హిందీలో రాబడుతున్న వసూళ్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు నిఖిల్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిందీలో కనీసం శాటిలైట్ ద్వారా కూడా పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. దర్శకుడు చందు మొండేటి కూడా హిందీలో గుర్తింపు ఉన్న హీరో కాదు. అయినా కూడా కార్తికేయ 2 సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేవలం సినిమా కాన్సెప్ట్ అక్కడి వారికి నచ్చడం వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఒక సినిమా లో హీరోగా నటించిన నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు అనడంలో సందేహం లేదు.
వంద కోట్ల వసూళ్లు నమోదు చేయబోతున్న కార్తికేయ 2 సినిమా కు గాను నిఖిల్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను 20 కోట్ల లోపు బడ్జెట్ తోనే రూపొందించారు. సినిమాకు పెద్దగా బజ్ లేని కారణంగా నిఖిల్ కేవల మూడు కోట్ల పారితోషికంను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే లాభాల్లో కొంత మొత్తంను ఇచ్చే విధంగా కూడా ఒప్పందం జరిగిందని కొందరు అంటున్నారు. ఆ లాభాల్లో వాటా ను పక్కన పెడితే ఈ సినిమాకు గాను నిఖిల్ కేవలం మూడు కోట్ల పారితోషికం మాత్రమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో నిఖిల్ పారితోషికం పది కోట్లకు పెరిగినా ఆశ్చర్యం లేదు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.