Maruti Suzuki : ఇండియాలో మారుతి సుజుకి 2022 Alto k10 కార్ ను విడుదల చేసింది. ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర 3.99 లక్షలు మొత్తం 6 వేరియంట్లలో ఈ కార్ లభిస్తుంది.std,Lxi,Vxi,AMT,Vxi+,Vxi+AMT వేరియంట్లలో ఈ కార్ను కొనవచ్చు. తొలిసారి ఇంపాక్టో, గ్లింటో పర్సనాలిజేషన్ థీమ్స్ తో ఈ కార్ రావడం విశేషం. హార్టిక్ట్ ఆర్కిటెక్చర్ ఆధారంగా 2022 ఆల్టో కే 10 కార్ తయారైంది. గతంలో రిలీజ్ అయిన మారుతి సుజుకి సెలెరియో మోడల్ లో కూడా ఈ టెక్నాలజీ ఉంది. సరికొత్త పెప్పి హెడ్ ల్యాంప్స్, డైనమిక్ హనీకాంబ్ ప్యాటర్న్ గ్రిల్ తో ముందు వైపు ఆకట్టుకుంటుంది. సైడ్ కి అల్లాయ్ వీల్స్ లేవు. ఫుల్ వీల్ కవర్ తో 13 అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి.
మెటాలిక్ గ్రానైట్ గ్రే, మెటాలిక్ సీజ్లింగ్ రెడ్, ప్రీమియం ఎర్త్ గోల్డ్ మెటాలిక్ సిల్కీ సిల్వర్ మెటాలిక్ స్పీడ్ బ్లూ, సాలిడ్ వైట్ కలర్స్ లో ఈ కార్ లభిస్తుంది. డిజిటల్ స్పీడోమీటర్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ రిమోట్ కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో వాయిస్ కంట్రోల్స్, 7 అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లాంటి ఫీచర్స్ ఉన్నాయి. యాపిల్ కార్లపై ఆండ్రాయిడ్ ఆటో స్మార్ట్ ప్లే స్టూడియో ఆప్స్ యాక్సెస్ చేయొచ్చు. సేఫ్టీ ఫీచర్స్ చూస్తే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం లాంటి ఫీచర్స్ ఉన్నాయి. కారు లోపల కేసీరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటి ఇంజిన్ ఉన్నాయి.
2022 ఆల్టో కె 10 మోడల్ 5 స్పీడ్ ఎఎటీ గేర్ బాక్స్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి. మైలేజ్ మాన్యువల్ మోడల్ కు 24.39 కిలోమీటర్లు ఆటోమేటిక్ మోడల్ కు లీటర్కు 24.90 కిలోమీటర్ల మైలేజ్ లభిస్తుంది. ఇప్పటికే వీటి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి మారుతి సుజుకి అరేనా డీలర్ షిప్ లో దగ్గర ఆల్టో కే10 ను బుకింగ్ చేయవచ్చు .మొదటి ఆల్టో కార్ 2000 సంవత్సరంలో విడుదలైంది. ఆ తర్వాత 2012లో రెండో తరం కారు వచ్చింది. ఎప్పుడు మూడోతరం ఆల్టో కార్ విడుదలైంది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆల్టో 800 మోడల్ తో పాటు 2022 ఆల్టో కే10 అమ్మకాలు జరుగుతాయి. మిడిల్ క్లాస్ ప్రజల్లో ఆల్టో కార్ కు క్రేజ్ ఎక్కువ. తొలిసారి కారు కొనాలనుకునే వారు తక్కువ ధరకే లభించే విధంగా ఈ కార్ ను కొనుక్కోవచ్చు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.