Home » Entertainment » Devullu Fame Nitya Shetty Shares Chiranjeevi Pic From Anji Movie
Entertainment

Nitya Shetty : ‘అంజి’ సినిమాలో ‘దేవుళ్లు’ పాప.. మెగాస్టార్‌తో క్రేజీ పిక్ షేర్ చేసిన నిత్యా శెట్టి

Authored By
aruna
The Telugu News | Published on: August 26, 2022, 1:00 pm
Advertisement

Nitya Shetty : దేవుళ్లు సినిమాను చూడని తెలుగు ప్రేక్షకులుండరు. మీ ప్రేమ కోరే చిన్నారులం అనే పాటతో పాటు.. అందులో ఉండే భక్తి గీతం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ పాటలు ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి. దేవుళ్లు సినిమాలో అక్కాతమ్ముళ్ల పాత్రలు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక ఇందులో అక్కగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. అదే లుక్కులో, అదే బబ్లీగా కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. నిత్యా శెట్టి ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. నిత్యా శెట్టి చిన్న నాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నిహారిక నిర్మించిన హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా నిత్యా శెట్టి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇక ఆమె చేతిలో సినిమాలు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

అయితే నిత్యా శెట్టిని ఇప్పుడు చూస్తున్నవారంతా కూడా చిన్న నాటి దేవుళ్లు సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో నిత్యా శెట్టి వస్తే.. అది, రాం ప్రసాద్‌లు కౌంటర్లతో ఆడుకున్నారు. చిన్నప్పుడు గుడికి వెళ్లేవాడిని కాదని, ఈమె చెప్పిందనే గుడికి వెళ్లానంటూ దేవుళ్లు సినిమాలోని పాటలు పాడి ఏడిపించేశారు. అలా నిత్యా శెట్టి ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది. హలో వరల్డ్ వెబ్ సిరీస్ అంతగా హిట్ కాకపోయినా కూడా.. నిత్యా శెట్టి కోసం అందరూ చూస్తున్నారు. ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ కాసాగింది.

Devullu fame Nitya Shetty Shares Chiranjeevi Pic From Anji Movie

Advertisement

చిరంజీవి బర్త్ డే సందర్భంగా నిత్యా శెట్టి ఓ పోస్ట్ వేసింది. అందులో చిరంజీవి గురించి చెబుతూ ఓ పోస్ట్ వేసింది. అందులో చిరంజీవితో కలిసి నిత్యా శెట్టి కనిపించింది. అంజి సినిమాలో తాను కూడా నటించాను అని అసలు విషయం చెప్పింది. దీంతో జనాలు అంతా అంజి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. అందులో నువ్వు కూడా ఉన్నావా? అంటూ ఆశ్చర్యపోతోన్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న జలపాతం గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. అది కేరళలోని అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అని అందరికీ రిప్లై ఇస్తోంది నిత్యా శెట్టి. మొత్తానికి ఈ ఫోటోలో మాత్రం నిత్యా శెట్టి భలే ముద్దుగా ఉంది.

Devullu fame Nitya Shetty Shares Chiranjeevi Pic From Anji Movie

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి