Redmi A1 : కేవలం 7వేల లోపే స్మార్ట్ ఫోన్… రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్…!
Redmi A1 : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉండడంతో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఇండియాలో రెడ్ మీ ఏ1+ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ను షావోమీ సబ్ బ్రాండ్ అయినా రెడ్ మీ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లెదర్ టెక్చర్ ఫినిష్ ఉన్న బ్యాక్ ప్యానెల్ తో రెడ్ మీ ఏ1+ వచ్చింది. రెడ్ మీ ఏ1 తో పోలిస్తే ఈ స్మార్ట్ ఫోన్ కొత్త అప్ గ్రేడ్లతో వచ్చింది. ఎంఐయుఐ కాకుండా దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉంటుంది. రెడ్ మీ ఏ1+ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.
2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6999 గా ఉంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ మోడల్ ధర రూ.7999 గా ఉంది. ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ సైట్ అయిన ఫ్లిప్ కార్ట్ mi.com , ఎంఐ హోమ్స్ లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఇంట్రక్టరీ ధరలు ఈనెల 31 తారీకు వరకు ఉంటాయి. ఆ తర్వాత రెడ్ మీ ఏ వన్ ప్లస్ రెండు వేరియంట్ ధరలు రూ.7,499 గా 2 జీబీ ర్యామ్ ఉంటుంది. రూ.8499 గా 3 జీబీ ర్యామ్ ఉంటాయని రెడ్ మీ వెల్లడించింది. బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 6.52 హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే తో రెడ్ మీ ఏ1+ వస్తుంది.
400 నిట్స్ పిక్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. మైక్రో ఎస్ బీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉంటుంది. రెడ్ మీ ఏ1+ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా మరో లెన్స్ కూడా ఉంటుంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఐదు మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరా ఈ ఫోన్ కు ఉంది. రెడ్ మీ ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పది వాట్ల స్టాండర్డ్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జి ఎల్ టిఈ, వైఫై బ్లూటూత్ 5, జిపిఎస్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, యూఎస్ బీ టైప్ సి పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.