Redmi Note 12 Pro : అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రెడ్ మీ నుంచి రాబోతున్న మరొ కొత్త స్మార్ట్ ఫోన్…!
షావోమి రెడ్ మీ నుంచి మరో కొత్త సిరీస్ ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. రెడ్ మీ నోట్ 12 సిరీస్ ను ఈ నెలలోనే విడుదల చేయనుంది. షావోమి బ్రాండ్ లో రెడ్ మీ నోట్ ఎంతో పాపులర్. దాదాపుగా ఈ లైన్ అప్ లో వచ్చిన అన్ని సిరీస్ లు హిట్ అయినవే. ఈ క్రమంలో రెడ్ మీ నోట్ 12 సిరీస్ అక్టోబర్ నెలలో రానుంది. దీంట్లో రెడ్ మీ నోట్ 12, రెడ్ మీ నోట్ 12 ప్రో, రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ను అక్టోబర్లో చైనాలో విడుదల చేనున్నట్లు షావోమి అధికారికంగా ప్రకటించింది.
ఆ తర్వాత రెండు నెలల్లోగా ఈ ఫోన్ లు చిన్న స్పెసిఫికేషన్స్ మార్పులతో భారత్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విబో లో రెడ్ మీ నోట్ 12 సిరీస్ ను అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు షావోమి అధికారికంగా వెల్లడించింది. అయితే కచ్చితంగా డేట్ ను ప్రకటించలేదు. దీంతో మరో మూడు రోజుల్లో తేదీని కూడా చెప్పే అవకాశం ఉంది. రెడ్ మీ నోట్ 12 సిరీస్ లో ఓ ఫోన్ 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుందని సమాచారం. అలాగే మీడియా టెక్ డైమండ్ సిటీ 1080 ప్రాసెసర్ను కలిగి ఉంది. ఈ సిరీస్లో మూడు ఫోన్లు కూడా 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి.
రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ రెడ్ మీ నోట్ 12 ప్రో ఫోన్ 6.6 ఇంచుల ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిప్రెషన్ రేటుతో వస్తాయని తెలుస్తుంది. నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ లో 4980 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. నోట్ 12 ప్రో ప్లస్ లో 4300ఎమ్ ఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలిపింది. రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 210 వాట్ల చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. నోట్ 12 ప్రో 120 వాట్స్, నోట్ 12 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తాయని తెలుస్తుంది. రెండు వందల వాట్ల ఫాస్ట్ చార్జింగ్ తో ప్రస్తుతం ఐకు పది ప్రో టాప్ లో ఉంది. 210 వాట్స్ తో రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ దాన్ని దాటవచ్చని అంటున్నాయి.