Reliance Jio : పండగ సీజన్ లో అదిరిపోయే ఆఫర్లు ప్రకటించిన జియో… వాటిపై భారీ తగ్గింపు

Authored By Tech Desk | The Telugu News | Published on: October 4, 2022, 8:00 am

Reliance Jio : పండుగ సీజన్ కావటంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు ఆఫర్లతో అదరగొట్టేస్తున్నాయి. ఇప్పుడు జియో కూడా తన వినియోగదారులకు పండగ ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో తన యూజర్లకు అదిరిపోయే లాభాలను అందిస్తుంది. ఏకంగా 4500 వరకు తగ్గింపు అందిస్తుంది. అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఫైబర్ తన వినియోగదారులకు ఫెస్టివల్ ఆఫర్స్ ను అందిస్తుంది. జియో ఫైబర్ రీఛార్జ్ ప్లాన్ లపై అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. రెండు రకాల ఫ్లాన్లకు ఈ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

కొన్ని ప్లాన్ లపై తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. జియో ఫైబర్ ఆఫర్ అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటుంది. జియో ఫైబర్ తన కస్టమర్లకు ప్రిపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. అలాగే పోస్ట్ పేయిడ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంచింది. జియో ఫైబర్ కు చెందిన రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు ఇప్పుడు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.599, రూ.899 క్లార్ల రీఛార్జ్ పై అదరపు తగ్గింపు లాభాలు అందిస్తున్నాయి. రూ.599 ప్లాన్ తీసుకుంటే వారికి రిలయన్స్ డిజిటల్ రూ.1000 తగ్గింపు కూపన్ లభిస్తుంది. అలాగే మింత్రా డిస్కౌంట్ కూపన్ రూ.1000 వస్తుంది.

Reliance Jio recharge offers

Reliance Jio recharge offer

ఐక్సిగో రూ.1500 తగ్గింపు ఓచర్ కూడా పొందవచ్చు అయితే కనీసం 6 నెలల పాటు ఈ ప్లాను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి. లేదంటే ఈ బెనిఫిట్స్ ఉండవు. రూ.899 తీసుకుంటే 500 విలువైన రిలయన్స్ డిజిటల్ కూపన్, రూ.500 తగ్గింపుతో కూడిన మింత్రా వోచర్ వంటివి లభిస్తాయి. ఇంకా జియో ద్వారా వేయి తగ్గింపు పొందవచ్చు. ఐక్సిగో ద్వారా 1500 తగ్గింపు వస్తుంది. ఈ ప్లాన్ కు కనీసం కస్టమర్లు మూడు నెలలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.599 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద 30 mbps స్పీడ్ తో నెట్ పట్టవచ్చు నెలకు 3.3టీబీ డేటా వస్తుంది. ఇంకా 15 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. 550 కి పైగా టీవీ ఛాన్స్ పొందవచ్చు. ఇంకా మై జియో యాప్ ద్వారా ఉచిత జియో సెటప్ బాక్స్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

Tech Desk

No bio available for this author.

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp