Smart Ring : మార్కెట్లోకి సాంసంగ్ స్మార్ట్ రింగ్… ఎంతో ఆకర్షనీయంగా… సరికొత్త ఫ్యూచర్స్ తో…!
Smart Ring : ప్రస్తుతం మారుతున్న సాంకేతిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సరికొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తుంది. దానికి అనుగుణంగానే సరికొత్త టెక్నాలజీతో వివిధ రకాల గడ్జెట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ప్రస్తుత కాలంలో ఈ ట్రెండ్ మరింత విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరగడంతో…దానికి అనుగుణంగా స్మార్ట్ యాక్సెసరీస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ వాచ్, ఫిట్నెస్ ట్రాక్టర్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి స్మార్ట్ రింగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారీసంస్థ సాంసంగ్ ఒక స్మార్ట్ రింగ్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇటీవల జరిగిన సాంసంగ్ అన్ ప్యాకెడ్ 2024 ఈవెంట్లో భాగంగా ఈ స్మార్ట్ రింగును మార్కెట్లోకి విడుదల చేశారు.
అయితే ఈ ఈవెంట్లో స్మార్ట్ రింగు మాత్రమే కాకుండా వివిధ రకాల వాచ్ లు, స్మార్ట్ ఫోన్స్ , ఇయర్ బర్డ్స్ తో పాటు ఇతర డివైస్లను కూడా సాంసంగ్ కంపెనీ విడుదల చేయడం జరిగింది. వీటిలో సాంసంగ్ తీసుకు వచ్చిన కొత్త రింగ్ విషయానికి వచ్చినట్లయితే..మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడే లక్ష్యంతో ఈ స్మార్ట్ రింగ్ డెవలప్ చేశారు. ఇక ఈ స్మార్ట్ రింగ్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచడంతోపాటు మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
Smart Ring స్మార్ట్ రింగ్ ధర…

Smart Ring : మార్కెట్లోకి సాంసంగ్ స్మార్ట్ రింగ్… ఎంతో ఆకర్షనీయంగా… సరికొత్త ఫ్యూచర్స్ తో…!
ఇక ఈ స్మార్ట్ రింగ్ ధర విషయానికొస్తే 399 డాలర్లు అంటే దాదాపు 34 వేల రూపాయలు… ఇక ఈ స్మార్ట్ రింగు జులై 10 2024 నుండి ఫ్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. కావున ఈ స్మార్ట్ రింగును జూలై 24 2024 నుండి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ రింగు స్మార్ట్ వాచ్ మాదిరిగానే మీ యొక్క ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ లను అంచనా వేయగలదు. ఇక ఈ స్మార్ట్ రింగ్ మనకు 9 వేర్వేరు సైజుల్లో మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్ మరియు టైటానియం గోల్డ్ కలర్స్ లో ఈ స్మార్ట్ రింగ్ మనకు అందుబాటులో ఉంటుంది.