Samsung Galaxy : శాంసంగ్ ఫోన్‌పై ఇంత డిస్కౌంటా… ఫీచర్స్ బాగున్నాయిగా..!
ప్రధానాంశాలు:
Samsung Galaxy : శాంసంగ్ ఫోన్‌పై ఇంత డిస్కౌంటా... ఫీచర్స్ బాగున్నాయిగా..!
Samsung Galaxy : శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం భారత్ మార్కెట్ లో విడుదల అయిన విషయం తెలిసిందే.ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి రాగా.. తాజాగా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
Samsung Galaxy : శాంసంగ్ ఫోన్‌పై ఇంత డిస్కౌంటా… ఫీచర్స్ బాగున్నాయిగా..!
Samsung Galaxy : బెస్ట్ డీల్..
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.11 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. మూడు కలర్ వేరియంట్స్ : అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉండేది. ప్రస్తుతం రూ.21999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.12 వేల తగ్గింపును పొందవచ్చు.
ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాలు ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.