SBI కస్టమర్లకు ఊహించని షాక్ , ఇక ఆ లావాదేవీలఫై చార్జీల మోత..!
ప్రధానాంశాలు:
SBI కస్టమర్లకు ఊహించని షాక్ , ఇక ఆ లావాదేవీలఫై చార్జీల మోత..!
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్ ఇస్తూ ఆన్‌లైన్ ఐఎంపీఎస్ (IMPS) లావాదేవీల ఛార్జీలలో కీలక మార్పులు చేసింది. సంక్రాంతి పండగ వేళ ఎస్‌బీఐ ప్రకటించిన ఈ నిర్ణయం డిజిటల్ లావాదేవీలు జరిపే వారిపై ప్రభావం చూపనుంది. ఇప్పటివరకు రూ. 5 లక్షల వరకు ఆన్‌లైన్ ఐఎంపీఎస్ (IMPS) బదిలీలు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు ఆ పరిమితిని భారీగా తగ్గించి రూ. 25,000 కు పరిమితం చేసింది. అంటే ఫిబ్రవరి 15, 2026 నుండి మీరు ఆన్‌లైన్ ద్వారా రూ. 25,000 దాటి ఒక్క రూపాయి బదిలీ చేసినా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తక్షణ నగదు బదిలీ కోసం ఐఎంపీఎస్‌ను ఎక్కువగా వాడే వ్యాపారస్తులు మరియు సామాన్యులకు ఇది అదనపు భారంగా మారనుంది.
SBI కస్టమర్లకు ఊహించని షాక్ , ఇక ఆ లావాదేవీలఫై చార్జీల మోత..!
SBI కస్టమర్లు తప్పక తెలుసుకోవాల్సిన వార్త , లేదంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ !!
కొత్త నిబంధనల ప్రకారం, ఆన్‌లైన్ లావాదేవీల విలువను బట్టి ఛార్జీలు మారుతాయి. రూ. 25,001 నుండి రూ. 1 లక్ష వరకు బదిలీ చేస్తే రూ. 2 + జీఎస్టీ, రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల మధ్య అయితే రూ. 6 + జీఎస్టీ, మరియు రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు భారీ లావాదేవీలకు రూ. 10 + జీఎస్టీ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే, బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి చేసే ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ల ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆఫ్‌లైన్‌లో రూ. 2 లక్షల పైన లావాదేవీలకు గరిష్టంగా రూ. 20 వరకు ఛార్జీలు యథావిధిగా కొనసాగుతాయి.
సంక్రాంతి పండగ వేళ కస్టమర్లకు షాక్ ఇచ్చిన SBI
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో గతంలో ఈ ఛార్జీలను ఎత్తివేసిన బ్యాంక్, ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించడం గమనార్హం. ఐఎంపీఎస్ సేవలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో (YONO) యాప్ మరియు ఏటీఎంల ద్వారా 24/7 అందుబాటులో ఉంటాయి. అయితే, యూపీఐ (UPI) లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతున్నందున, చిన్న మొత్తాల బదిలీకి ఇబ్బంది ఉండదు. కానీ, పెద్ద మొత్తంలో నగదును తక్షణమే పంపాల్సిన అవసరం ఉన్నప్పుడు వినియోగదారులు నెఫ్ట్ (NEFT) లేదా ఆర్టీజీఎస్ (RTGS) వంటి ఇతర ఆప్షన్లను పరిశీలించుకోవాల్సి ఉంటుంది.SBI IMPS Charges , SBI IMPS Charges 2026, SBI Online Transfer Charges, SBI Bank Latest News, SBI Customers Shock, IMPS Transaction Charges SBI, SBI IMPS ఛార్జీలు , SBI కస్టమర్లకు షాక్, SBI కొత్త నిబంధనలు 2026, SBI బ్యాంక్ తాజా వార్తలు, SBI IMPS charges Telugu, IMPS లావాదేవీలపై ఛార్జీలు, SBI డిజిటల్ లావాదేవీలు, SBI ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు, SBI బ్యాంక్ అలర్ట్ న్యూస్,