
Aadhaar Card : మీ ఆధార్ కార్డ్ సేఫ్‌గా ఉందా,లేదా.. ఇలా చెక్ చేసుకోండి..!
Aadhaar Card : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ Aadhaar Card ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకం అయిన సరే, అన్ని ఆధార్‌తోనే Aadhaar Card ముడిపడి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మోసాలు జరుగుతుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడంతా ఆన్ లైన్ సేవలే కాబట్టి ఎవరి ఆధార్ వివరాలైనా మిస్ యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఆధార్ కార్డు వివరాలతో ఆన్‌లైన్ మోసాలు చేసే మోసగాళ్లు చాలా మంది ఉంటారు. అనధికారిక యాక్సెస్, ఆర్థిక మోసాలకు దొంగిలించిన ఆధార్ వివరాలను మోసగాళ్ళు ఉపయోగించారు. మీ ఆధార్ కార్డు కూడా ఇలా మిస్ యూజ్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి UIDAI సహాయం చేస్తోంది.
Aadhaar Card : మీ ఆధార్ కార్డ్ సేఫ్‌గా ఉందా,లేదా.. ఇలా చెక్ చేసుకోండి..!
మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్‌ని ఉపయోగిస్తున్నారని మీరు డౌట్ ఉంటే, ఇలా చెక్ చేయండి. ముందుగా మై ఆధార్ పోర్టల్‌కి వెళ్లాలి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, “OTPతో లాగిన్ అవ్వండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి దాన్ని నమోదు చేయండి. మీ ఆధార్ ఉపయోగించిన అన్ని సందర్భాలను చూడటానికి “Authentication History”కి వెళ్లి తేదీల వారీగా చెక్ చేయండి. ఎక్కడైనా అనధికారిక వినియోగం కనిపిస్తే UIDAIకి వెంటనే తెలియజేయండి.
UIDAI యొక్క టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1947కి కాల్ చేయండి లేదా మీ నివేదికను help@uidai.gov.in మెయిల్ ఐడీకి పంపండి.మరోవైపు దుర్వినియోగాన్ని నివారించడానికి ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేసి అన్‌లాక్ చేసే ఎంపికను UIDAI కూడా అందిస్తుంది. మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయడం వల్ల ఎవరైనా మీ ఆధార్ వివరాలకు యాక్సెస్ కలిగి ఉన్నప్పటికీ, వారు బయోమెట్రిక్ సమాచారాన్ని దుర్వినియోగం చేయలేరు. మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ని లాక్ చేయడానికి OTPని ఉపయోగించి సేఫ్ గా ఉండండి.
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
This website uses cookies.