Aadhaar Card : మీ ఆధార్ కార్డ్ సేఫ్‌గా ఉందా,లేదా.. ఇలా చెక్ చేసుకోండి..!
ప్రధానాంశాలు:
Aadhaar Card : మీ ఆధార్ కార్డ్ సేఫ్‌గా ఉందా,లేదా.. ఇలా చెక్ చేసుకోండి..!
Aadhaar Card : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ Aadhaar Card ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకం అయిన సరే, అన్ని ఆధార్‌తోనే Aadhaar Card ముడిపడి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మోసాలు జరుగుతుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడంతా ఆన్ లైన్ సేవలే కాబట్టి ఎవరి ఆధార్ వివరాలైనా మిస్ యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఆధార్ కార్డు వివరాలతో ఆన్‌లైన్ మోసాలు చేసే మోసగాళ్లు చాలా మంది ఉంటారు. అనధికారిక యాక్సెస్, ఆర్థిక మోసాలకు దొంగిలించిన ఆధార్ వివరాలను మోసగాళ్ళు ఉపయోగించారు. మీ ఆధార్ కార్డు కూడా ఇలా మిస్ యూజ్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి UIDAI సహాయం చేస్తోంది.

Aadhaar Card : మీ ఆధార్ కార్డ్ సేఫ్‌గా ఉందా,లేదా.. ఇలా చెక్ చేసుకోండి..!
Aadhaar Card ఇలా చేయండి..
మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్‌ని ఉపయోగిస్తున్నారని మీరు డౌట్ ఉంటే, ఇలా చెక్ చేయండి. ముందుగా మై ఆధార్ పోర్టల్‌కి వెళ్లాలి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, “OTPతో లాగిన్ అవ్వండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి దాన్ని నమోదు చేయండి. మీ ఆధార్ ఉపయోగించిన అన్ని సందర్భాలను చూడటానికి “Authentication History”కి వెళ్లి తేదీల వారీగా చెక్ చేయండి. ఎక్కడైనా అనధికారిక వినియోగం కనిపిస్తే UIDAIకి వెంటనే తెలియజేయండి.
UIDAI యొక్క టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1947కి కాల్ చేయండి లేదా మీ నివేదికను [email protected] మెయిల్ ఐడీకి పంపండి.మరోవైపు దుర్వినియోగాన్ని నివారించడానికి ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేసి అన్‌లాక్ చేసే ఎంపికను UIDAI కూడా అందిస్తుంది. మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయడం వల్ల ఎవరైనా మీ ఆధార్ వివరాలకు యాక్సెస్ కలిగి ఉన్నప్పటికీ, వారు బయోమెట్రిక్ సమాచారాన్ని దుర్వినియోగం చేయలేరు. మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ని లాక్ చేయడానికి OTPని ఉపయోగించి సేఫ్ గా ఉండండి.