Self-Driving Scooters : దేవుడా…సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు కూడా వచ్చేసాయి.. వీడియో !
ప్రధానాంశాలు:
Self-Driving Scooters : దేవుడా...సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు కూడా వచ్చేసాయి.. వీడియో !
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా ఇప్పుడు రోడ్లపై స్వయంగా నడిచే స్కూటర్లను కనిపెట్టింది. ఈ స్కూటర్లు డ్రైవర్ లేకుండానే నిర్దిష్ట లొకేషన్‌కి చేరే సామర్థ్యం కలిగి ఉండటం విశేషం. యూజర్ ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నా, ఆ లొకేషన్‌ను సెలెక్ట్ చేస్తే చాలు – మిగతా ప్రయాణాన్ని స్కూటరే తీసుకెళ్తుంది. పూర్తి స్థాయిలో GPS, AI టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ స్కూటర్లు ట్రాఫిక్‌కి అనుగుణంగా మార్గాన్ని ఎంపిక చేస్తూ, అవరోధాలను తప్పించుకుంటూ నడుస్తాయి.

Self-Driving Scooters : దేవుడా…సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు కూడా వచ్చేసాయి.. వీడియో !
Self-Driving Scooters : చైనా లో ఆకట్టుకుంటున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు వ్యక్తిగత ప్రయాణాలకే కాకుండా, డెలివరీ సేవల్లోనూ విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఇకపై ఫుడ్ డెలివరీ, పార్సల్ డెలివరీ వంటి సేవల కోసం మనుషులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. లొకేషన్ సెటప్ చేసి, వస్తువును స్కూటర్‌లో పెట్టి పంపిస్తే, అదే చేరవేస్తుంది. ఇది డెలివరీ బిజినెస్‌ను పూర్తిగా మార్చివేయబోతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
అత్యాధునిక సెన్సార్లు, కెమెరాలు, మరియు మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ స్కూటర్లు, రహదారుల్లో భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ వ్యవస్థ వలన ట్రాఫిక్ తగ్గింపుతో పాటు కాలుష్యం నియంత్రణకు కూడా తోడ్పడుతుంది. భవిష్యత్తులో ఈ విధమైన సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. చైనాలో ఇప్పటికే కొన్ని నగరాల్లో ఈ స్కూటర్లు ప్రయోగాత్మకంగా నడుస్తుండగా, మంచి ఫలితాలు వస్తే త్వరలోనే వాణిజ్య పరంగా అందుబాటులోకి రానున్నాయి.
చైనాలో రోడ్లపై పరుగులు పెడుతున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు
స్కూటర్‌పై కూర్చొని ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, లొకేషన్ సెట్ చేస్తే చాలు మిగతా పనంతా స్కూటర్ చేస్తుంది.
డెలివరీ పర్సన్స్ అవసరం లేకుండా ఏదైనా వస్తువులు డెలివరీ చేసుకునే అవకాశం pic.twitter.com/ciBhXciPg4
— greatandhra (@greatandhranews) April 18, 2025