Amazon : టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్… ఏకంగా ఈ టీవీపై 40 శాతం డిస్కౌంట్…!
Amazon : ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఆఫర్ లో భాగంగా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే అమెజాన్ టీవీలపై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది. సోనీ బ్రావియా 55 ఇంచుల టీవీ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. ప్రీమియం స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీపై ఏకంగా 39% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సోనీ బ్రావియా 55 ఇంచుల టీవీ అసలు ధర 99,900. అయితే అమెజాన్లో రూ.60,990 కొనుగోలు చేయవచ్చు అంటే దాదాపుగా 39 వేల తగ్గింపు లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీల పై కూపన్ డిస్కౌంట్ కింద అదనంగా 1000 తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. దీంతో టీవీ ధర రూ.59,990 గా ఉంది. అంటే డిస్కౌంట్ ₹40 వేలకు చేరుతుంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ.2500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్, ఆర్ బిఎల్ బ్యాంక్, వన్ కార్డు కస్టమర్లకు అదనపు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో ఈ టీవీ ధర మరింత తగ్గి వస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఈ టీవీ పై ఎక్సైంజ్ ఆఫర్ కూడా ఉంది.ఎక్సైంజ్ ఆఫర్ పై రూ.4390 వరకు తగ్గింపు పొందవచ్చు.

Sony Bravia smart tv available in Amazon with 40% discount offer
ఎక్సైంజ్ ఆఫర్ అనేది పాత టీవీ మోడల్ ను బట్టి ఉంటుంది. అలాగే ఈ టీవీ ను ఈఎంఐ లో కొనవచ్చు. బజాజ్ కార్డ్ పై నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ పొందవచ్చు. 12 నెలల దాకా ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ.5,100 కట్టాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తున్నాయి. నెలకు రూ.3388 ఈఎంఐ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 24 నెలల వరకు కాస్ట్ ఈఎంఐ అందిస్తోంది. నెలకు రూ.2541 చెల్లించాలి. ఇంకా రెడ్ మీ 65 ఇంచుల స్మార్ట్ టీవీ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. ఈ టీవీ ని రూ.57,999 కు కొనవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.74,999. అంటే 17 వేల తగ్గింపు లభిస్తుంది.