Amazon | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ .. వన్‌ప్లస్ ఫోన్లపై భారీ తగ్గింపులు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amazon | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ .. వన్‌ప్లస్ ఫోన్లపై భారీ తగ్గింపులు!

 Authored By sandeep | The Telugu News | Updated on :18 September 2025,6:00 pm

Amazon | ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రతిష్టాత్మక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనుంది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని నిర్వహించే ఈ భారీ సేల్‌లో, వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్ అప్లయెన్సులు, వేర్‌బుల్స్ వంటి అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే డిస్కౌంట్లు అందించనుంది.

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ ఒక రోజు ముందే, అంటే సెప్టెంబర్ 22 నుంచే అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక ఆఫర్లను అమెజాన్ ముందుగానే వెల్లడించింది. వాటిలో వన్‌ప్లస్ ఫోన్లపై ప్రకటించిన భారీ డిస్కౌంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

#image_title

వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లపై స్పెషల్ ఆఫర్లు

వన్‌ప్లస్ 13
ఈ ఏడాది ప్రారంభంలో రూ.69,999 ధరకు విడుదలైన ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను ఇప్పుడు కేవలం రూ.57,999కి కొనుగోలు చేయవచ్చు.
(ఈ ధరలో ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై లభించే డిస్కౌంట్లు కూడా చేర్చబడ్డాయి.)

వన్‌ప్లస్ 13ఎస్
ఇటీవలే రూ.54,999కి లాంచ్ అయిన ఈ మోడల్‌ను ఇప్పుడు రూ.47,999కే పొందొచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ డిస్కౌంట్లు

వన్‌ప్లస్ మిడ్రేంజ్ కేటగిరీలో ఉన్న నార్డ్ సిరీస్ ఫోన్లపై కూడా ఆకర్షణీయమైన ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి:

వన్‌ప్లస్ నార్డ్ 5 – రూ.28,749

వన్‌ప్లస్ నార్డ్ 4 – రూ.25,499

వన్‌ప్లస్ నార్డ్ CE 4 – రూ.18,499

వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ – రూ.15,999

(ఈ ధరలు ఎస్‌బీఐ బ్యాంక్ కార్డులపై లభించే అదనపు డిస్కౌంట్లను కలుపుకొని నిర్ణయించబడ్డాయి)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది