Vivo 5G Smart Phone : కేవలం 8,999 కే వివో 5G స్మార్ట్ ఫోన్ .. స్పెసిఫికేషన్స్ అదుర్స్ ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 December 2022,7:40 am

Vivo 5G Smart Phone : ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ను వినియోగిస్తున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 5జి నెట్వర్క్ నడుస్తుంది. అందుకే ఫోన్ తయారీ కంపెనీలు స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనా కంపెనీ అయినా వివో బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.8999 గా నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.51అంగుళాలహెచ్‌డీ+ డిస్‌ప్లే, ఐ ప్రొటెక్షన్ మోడ్‌, ఆండ్రాయిడ్‌ 12, మీడియా టెక్‌ చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ వంటి వాటిని కలదు.

ఇందులో స్టోరేజ్ ను మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్ మీ సిరీస్, రెడ్మీ సిరీస్ పోకో సిరీస్ కి ఈ ఫోన్ గట్టి పోటీ అని చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లో వివరాలకు వస్తే ఇందులో 6.51 అంగుళాల హెచ్డి ప్లస్, ఫుల్ వ్యూ డిస్ ప్లే కలదు. వాటర్ డ్రా స్టైల్లో ఈ ఫోన్ ఉంది. అత్తా కోర్ మీడియా టెక్ చిప్ సెట్ ఉంది. అయ్యే అవకాశం ఉంది. 3 జీబీ ర్యామ్+ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

vivo 5G Smart phone launched at 8,999 only

vivo 5G Smart phone launched at 8,999 only

ఇక కెమెరాలను చూసుకుంటే వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా కలదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫేస్ బ్యూటీ, టైమ్ ల్యాప్స్ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో కలవు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W వైర్డ్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర పాట్నర్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ధర కూడా చాలా తక్కువ కాబట్టి వెంటనే కొనుగోలు చేయండి.

Advertisement

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి