WhatsApp : మరో అద్భుతమైన ఫ్యూచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WhatsApp : మరో అద్భుతమైన ఫ్యూచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్….!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2022,4:00 pm

WhatsApp : ప్రముఖ దిగ్గజ సంస్థ వాట్సాప్ యూజర్లకు ఎన్నో అద్భుతాలను కల్పిస్తోంది. ఇప్పటికే చాలా రకాలు సదుపాయాలు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక దీనిలో భాగంగా మరికొన్ని చర్యలను ఇప్పుడు వాట్సప్ తీసుకుంటుంది. వినియోగదారుల శ్రేయస్సు ప్రధానంగా భావించి ఎన్నో ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్, నిత్యం పలురకాల పోకడలకు శ్రీకారం చుడుతుంది. ఈ క్రమంలో వాట్సాప్ మరో ఫ్యూచర్ కు శ్రీకారం చుట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యూచర్స్ ను మార్చుతూ ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వాట్సాప్. ఇప్పుడు తాజాగా మన సందేశాలను మన నంబర్ కే పంపించుకునే విధంగా ఫ్యూచర్ కు ప్రయత్నిస్తుంది.

ఇక ఈ ఫ్యూచర్ ని ఉపయోగించి నోట్స్ , రిమైండర్స్, ఇంటి సరుకుల లిస్టు, షాపింగ్ లిస్టు రాసుకునే విధంగా , ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అయితే ఈ ఫ్యూచర్ ని పొందడం కోసం మనం చాట్ మెసేజ్ ఆప్షన్లు పై క్లిక్ చేయాలి. ఇలా చేయగా కాంటాక్ట్ లిస్ట్ అని వస్తుంది. అక్కడ బ్రాకెట్ లో you అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సెల్ఫ్ మెసేజ్ ఆప్షన్ వస్తుంది. ఇక ఈ ఫ్యూచర్ ని ఉపయోగించుకొని మనకు మనమే మెసేజ్ లు పంపుకోవచ్చు. అయితే ఈ ఫ్యూచర్ ఇప్పుడు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. మరో వారం పది రోజుల్లో ఈ ఫ్యూచర్ అందరికీ అందుబాటులోకి రానుంది అని సమాచారం. అయితే ఈ ఫ్యూచర్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పాలి.

WhatsApp brought another amazing future

WhatsApp brought another amazing future

రోజు వారి బిజీ షెడ్యూల్లో మనం చాలా మర్చిపోతుంటాం. ఇక అలాంటివి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫ్యూచర్ ను ఉపయోగించుకోవచ్చు. మనకు కావాల్సిన సమాచారాన్ని మనమే టైప్ చేసుకుని భద్రంగా ఉంచుకోవచ్చు. ఈ విధంగా వాట్సాప్ కొత్త పద్ధతులు చేపడుతూ ప్రజలకు సులభంగా పనుల అయ్యే విధంగా ముందుకు వెళుతుంది . అయితే భవిష్యత్తులో వాట్సాప్ మరిన్ని ఫ్యూచర్లను అప్డేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఎక్కువమంది వినియోగించే సామాజిక మాధ్యమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక రాబోయే కాలంలో మరిన్ని ఫ్యూచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చి తమ వినియోగదారులను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది వాట్సాప్.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది