WhatsApp – Supreme Court : మీరు ఇలా చేస్తే భారత్‌లో వాట్సప్‌ను నిషేదిస్తాం : సుప్రీంకోర్టు వార్నింగ్

 Authored By suma | The Telugu News | Updated on :3 February 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  WhatsApp - Supreme Court : మీరు ఇలా చేస్తే భారత్‌లో వాట్సప్‌ను నిషేదిస్తాం : సుప్రీంకోర్టు వార్నింగ్

WhatsApp – Supreme Court :  వాట్సప్‌ ప్రైవసీ పాలసీ వ్యవహారంలో  WhatsApp privacy policy issue  భారత సుప్రీంకోర్టు Supreme Court తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాట్సప్‌ మాతృ సంస్థ మెటా Meta పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కఠిన వ్యాఖ్యలు చేశారు. “భారతదేశ గోప్యతతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదు. మా పౌరుల డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు మేం అనుమతించం. దేశ చట్టాలను పాటించలేకపోతే భారత్‌ను వీడి వెళ్లడమే మార్గం” అని ఆయన స్పష్టం చేశారు. 2021లో వాట్సప్‌ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ డేటా సార్వభౌమత్వం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కోర్టు స్పష్టంగా చెప్పడం గమనార్హం.

Supreme Court warns WhatsApp

WhatsApp – Supreme Court : మీరు ఇలా చేస్తే భారత్‌లో వాట్సప్‌ను నిషేదిస్తాం : సుప్రీంకోర్టు వార్నింగ్

WhatsApp – Supreme Court :  వినియోగదారుల డేటా దోపిడీ అన్న ప్రభుత్వం వాదన

ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టులో వాదనలు వినిపిస్తూ వాట్సప్‌ తన వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని ఆరోపించారు. ఇది నేరుగా దోపిడీకి సమానమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీజేఐ మెటా విధానాలు చాలా క్లిష్టంగా ఉండటంతో సాధారణ ప్రజలు మాత్రమే కాదు న్యాయమూర్తులకే అర్థం కావడం కష్టమని అన్నారు. ఒకసారి తనకు వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్‌ పంపిన కొద్ది సమయంలోనే అదే తరహా ప్రకటనలు తన ఫోన్‌లో కనిపించాయని ఉదాహరణగా చెప్పారు. చదువుకున్న వారికి కూడా అర్థం కాని ఈ పాలసీలను దేశంలోని లక్షలాది పేద, నిరక్షరాస్య ప్రజలు ఎలా గ్రహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ఆందోళన తీవ్రతను స్పష్టంగా చూపించాయి.

WhatsApp – Supreme Court :  వాట్సప్‌ వివరణలు, హామీలు

వాట్సప్‌ తన వాదనలో వినియోగదారుల భద్రత, ప్రైవసీ, సమాచార గోప్యతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపింది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్లను యూజర్లకు ముందుగానే అందించామని పేర్కొంది. ఫేస్‌బుక్‌తో డేటా పంచుకుంటున్నామన్న ఆరోపణలు మొదట్లో నిరాకరించినా తరువాత కొంతమంది యూజర్ల అనుభవాలకు సంబంధించిన సమాచారం మాత్రమే పంచుకున్నామని అంగీకరించింది. అయితే దీనివల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా బిజినెస్‌ యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకునే కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించింది. వ్యక్తిగత సందేశాలు, కాల్స్‌ అన్నీ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికత ద్వారా రక్షణ పొందుతున్నాయని వాటిని తాము చూడలేమని వాట్సప్‌ కోర్టుకు హామీ ఇచ్చింది. ఈ వ్యవహారం ద్వారా డిజిటల్‌ యుగంలో పౌరుల గోప్యత ఎంత కీలకమో సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. అంతర్జాతీయ సంస్థలైనా భారత చట్టాలు, ప్రజల హక్కులను గౌరవించాల్సిందేనని న్యాయస్థానం ఇచ్చిన సంకేతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి