WhatsApp : అదరగొడుతున్న వాట్సాప్ కొత్త ఫీచర్… ఫోటోను బ్లర్ చేసుకునేలా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WhatsApp : అదరగొడుతున్న వాట్సాప్ కొత్త ఫీచర్… ఫోటోను బ్లర్ చేసుకునేలా!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 November 2022,6:20 pm

WhatsApp : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో వాట్సాప్ అనేది కచ్చితంగా ఉంటుంది. అంతలా పాపులర్ అయిపోయింది వాట్సాప్ యాప్. అయితే వాట్సాప్ ప్రస్తుతం యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. వెంట వెంటనే వినియోగదారులకు కొత్త సదుపాయాలను అందిస్తుంది. ఈ మధ్యనే చాలా ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్నింటిని అందించేందుకు వాట్సాప్ కృషి చేస్తుంది. ఈ క్రమంలో డెస్క్ టాప్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరు డెస్క్ టాప్ బీటా యూజర్లకు ఇమేజ్ బ్లర్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్ వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ ఇమేజ్ బ్లర్ టూల్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇమేజ్ బ్లర్ టూల్ గురించి వాట్సాప్ బీటా ట్రాకర్ డబ్ల్యూ బీటా ఇన్ఫో వెల్లడించింది. కొందరు డెస్క్ టాప్ బీటా యూజర్లకు ఈ సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని రిపోర్ట్ ద్వారా తెలిపింది. మరింత సెక్యూర్ గా ఫోటోలు షేర్ చేసుకునేందుకు ఈ బ్లర్ టూల్ ఉపయోగపడుతుంది. ఫోటోలు పంపించే ముందు ఆ ఫోటోలోని ఏదైనా భాగాన్ని ఈ టూల్ సహాయంతో బ్లర్ చేసి పంపించే అవకాశం ఉంటుంది. అంటే రిసీవర్కు ఏదైనా భాగం ఫోటోలు కనిపించకూడదు అనుకుంటే దాన్ని బ్లర్ చేసి పంపించే సదుపాయం ఈ టూల్ వలన కలగనుంది. త్వరలోనే ఇమేజ్ బ్లర్ ఫీచర్లు మొబైల్ బీటా వెర్షన్ కు కూడా తెచ్చే అవకాశం ఉంది. యూజర్లందరికీ ఈ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

WhatsApp introduce new image blur tool

WhatsApp introduce new image blur tool

అలాగే గ్రూపుల నుంచి సైలెంట్ గా ఎగ్జిట్ అవ్వడం, ఆన్లైన్ యాక్టివ్ స్టేటస్ ను హైడ్ చేసుకోవడం, వ్యూ వన్స్ మెసేజ్ లకు స్క్రీన్ షాట్స్ ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ త్వరలోనే తీసుకురాబోతుంది. ఈ ఫీచర్లు కూడా వినియోగదారులందరికీ అది కొద్ది రోజుల్లోనే వస్తాయి. మరోవైపు వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.22.23.15 వర్షన్ తో ఓ కొత్త ఫీచర్ను అందిస్తుంది. మీడియా క్యాప్షన్ తో ఫార్వర్డ్ చేసుకుని సదుపాయం ఇస్తుంది. మరోవైపు వినియోగదారులందరూ ఎదురుచూస్తున్న ఎడిట్ మెసేజ్ పై వాట్సాప్ పని చేస్తుంది. ఈ ఫీచర్ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఇస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది