Computer Keyboard : కంప్యూటర్ కీబోర్డులో ఏ, బి, సి, డి లు ఎందుకు వరుస క్రమంలో ఉండవో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Computer Keyboard : కంప్యూటర్ కీబోర్డులో ఏ, బి, సి, డి లు ఎందుకు వరుస క్రమంలో ఉండవో తెలుసా…?

Computer Keyboard : ప్రస్తుతం కంప్యూటర్ జనరేషన్ బాగా పెరిగింది. చాలా మంది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారు. కంప్యూటర్లు లేనిది వివిధ రకాల పనులు జరగని పరిస్థితి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ బాగా పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ కంప్యూటర్ల వాడకం కూడా ఎక్కువైపోతుంది. అయితే కంప్యూటర్ ఆపరేటింగ్ లో కీబోర్డు చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతే కంప్యూటర్లో ఏ పని జరగదు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి పెన్ను పేపర్ పెట్టి రాసే రోజులు పోయాయి. ప్రస్తుతం […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2022,6:00 am

Computer Keyboard : ప్రస్తుతం కంప్యూటర్ జనరేషన్ బాగా పెరిగింది. చాలా మంది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారు. కంప్యూటర్లు లేనిది వివిధ రకాల పనులు జరగని పరిస్థితి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ బాగా పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ కంప్యూటర్ల వాడకం కూడా ఎక్కువైపోతుంది. అయితే కంప్యూటర్ ఆపరేటింగ్ లో కీబోర్డు చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతే కంప్యూటర్లో ఏ పని జరగదు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి పెన్ను పేపర్ పెట్టి రాసే రోజులు పోయాయి. ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయాలన్న కంప్యూటర్ వచ్చి ఉండాలి. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ లేనిదే పనులు జరగవు.

అయితే కంప్యూటర్ వాడాలంటే కీబోర్డ్ అనేది తప్పనిసరి. మన ప్రతిరోజు కీబోర్డుపై ఎంతో పని చేస్తూ ఉంటాం. సాధారణంగా వాడే కీబోర్డును క్వర్టీ కీబోర్డ్ అంటారు. కీబోర్డులు ఏ, బి, సి, డి లు వరుస క్రమంలో ఉండవు. ఏ ఒకచోట ఉంటే బి మరొకచోట ఉంటుంది. ఇలా కీబోర్డ్ లోని లెటర్స్ అన్ని గజిబిజిగా ఉంటాయి. అలా ఏ, బి, సి, డి లు వరుస క్రమంలో లేకుండా గజిబిజిగా ఉండడానికి కారణం కూడా ఉంది. కీబోర్డులో పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q,W,E,R,T,Y,U,I,O,P అనే లెటర్స్ ఉంటాయి. వీటిని కలిపేసి చదువుతూ ఉంటారు. ఈ తరహా కీబోర్డును అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి 1868లో రూపకల్పన చేశారు. అంతకుముందు ఏ, బి, సి, డి లాగా వరుసగా ఉన్న కీబోర్డ్ పై ఆయన కొన్ని ఇబ్బందులు గుర్తించారట.

Why computer letters on Computer Keyboard are not in alphabetical order

Why computer letters on Computer Keyboard are not in alphabetical order

ఇంగ్లీషు భాషలో కొన్ని అక్షరాలు ఎక్కువసార్లు వాడుతుంటాం. మరికొన్ని అక్షరాలు ఎప్పుడు ఒకసారి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకు Q,Z,W,X వంటి అక్షరాలను తక్కువగా వాడుతుంటాం. ఈ అక్షరాలను ఎక్కువగా వాడము. కొన్ని సందర్భాలలో వాడుతాము. ఇక అచ్చులైనాA,E,I,O,U లతో పాటు P,B,N,M,K,L వంటి అక్షరాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండా ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతి వేళ్లకు అనుకూలమైన స్థానాల్లో ఉండేలా షోల్స్ తాను రూపొందించిన టైప్ మిషన్ కీబోర్డు QWERTY నమూనాలో చేశాడట. మనం సాధారణంగా ఎక్కువగా ఈ అక్షరాలనే వాడుతుంటాము. పైనున్న అక్షరాలు తక్కువగా ఉపయోగిస్తాం. అదే ప్రాసెస్ అన్ని కీ బోర్డులకు వ్యాపించింది. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం మరింత సులువైన కీబోర్డ్ అమరికలున్నట్లు ప్రూవ్ చేసారు. ఇలా ఎక్కువగా ఉపయోగించే లెటర్స్ ను బట్టి చేతి వేళ్లకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేశారు. ఈ కారణం చేతనే కీబోర్డులో ఏ,బి,సి,డిలు వరుస క్రమంలో ఉండవు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది