Xiaomi Smart Phones launched with good specifications
Xiaomi Smart Phones : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పర్స్ మరిచిపోతారేమో కానీ స్మార్ట్ ఫోన్స్ మాత్రం మర్చిపోరు. అంతలా స్మార్ట్ ఫోన్లకి బానిసలు అయిపోయారు. పెద్దవాళ్లు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ ను బాగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ కి ఇంత డిమాండ్ ఉండటంతో మార్కెట్లోకి కూడా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ప్రముఖ చైనా కంపెనీ అయినా షావోమి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. షావోమి 12 సిరీస్ కు కొనసాగింపుగా 13 సిరీస్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమి 13, 13 ప్రో వేరియంట్లలో తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్ 13 ఎంఐయుఐ14 ఐఫోన్ డిజైన్ మాదిరిగా వీటిని తీసుకొచ్చింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్స్ లో లైకా బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చింది. అయితే ఇప్పుడు ఇవి కేవలం చైనా మార్కెట్లో విడుదలయ్యాయి. ఇండియా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎప్పుడు విడుదల అవుతాయో క్లారిటీ ఇవ్వలేదు. ఇక షావోమి 13 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ ఫోన్ 6.73 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 3200×1440 రెజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్లో 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 4820mah బ్యాటరీని కలిగి ఉంది.
Xiaomi Smart Phones launched with good specifications
షావోమి 13 ప్రో స్మార్ట్ ఫోన్లు వైట్, బ్లాక్, గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ధరల విషయానికొస్తే 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర 60,000 గా ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ.74,500. ఇక షావోమి 13 స్మార్ట్ ఫోన్ కూడా ఇటువంటి ఫీచర్లను కలిగి ఉంది. 6.36 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే ను కలిగి ఉంది. 1080 × 2400 పిక్సెల్ రెజల్యూషన్ , 4500mah బ్యాటరీ నీ కలిగి ఉంది. ఇక 8 జీబీ ర్యాంక్, 128 స్టోరేజ్ ధర రూ.47,344. అలాగే 8జీబీ రామ్, 512 స్టోరేజ్ ధర 59,000 గా ఉంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.