Smart TV : కేవలం 24 వేలకే 224 ఇంచుల స్క్రీన్ .. అచ్చం సినిమా హాల్లో చూసినట్టుగానే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Smart TV : కేవలం 24 వేలకే 224 ఇంచుల స్క్రీన్ .. అచ్చం సినిమా హాల్లో చూసినట్టుగానే ..!

Smart TV : ప్రస్తుత ప్రతి ఒక్కరు స్మార్ట్ టీవీ లను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటికి మించి ఇంట్లో పెద్ద స్క్రీన్ పై సినిమాలు చూడాలనుకునే వారికి ఈ స్మార్ట్ ప్రాజెక్టర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా కొత్త స్మార్ట్ ప్రాజెక్టర్ ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అండ్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ జెబ్రానిక్స్ మార్కెట్‌లోకి తెచ్చింది. దీని పేరు జెబ్ పిక్సాప్లే 17. ఈ ప్రొజెక్టర్ తో ఇంట్లోనే సినిమా హాల్ ఫీలింగ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 December 2022,5:40 pm

Smart TV : ప్రస్తుత ప్రతి ఒక్కరు స్మార్ట్ టీవీ లను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటికి మించి ఇంట్లో పెద్ద స్క్రీన్ పై సినిమాలు చూడాలనుకునే వారికి ఈ స్మార్ట్ ప్రాజెక్టర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా కొత్త స్మార్ట్ ప్రాజెక్టర్ ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అండ్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ జెబ్రానిక్స్ మార్కెట్‌లోకి తెచ్చింది. దీని పేరు జెబ్ పిక్సాప్లే 17. ఈ ప్రొజెక్టర్ తో ఇంట్లోనే సినిమా హాల్ ఫీలింగ్ ని పొందవచ్చు. ఏకంగా 224 అంగుళాల స్క్రీన్ పై సినిమాలు చూడవచ్చు. ఈ ప్రొజెక్టర్ 6000 లుమెన్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ ఫీచర్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ధర రూ. 24,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే రూ. 24 వేలకే ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్ లో ఆటో ఫోకస్, కీస్టోన్ అడాప్షన్, డాల్బే ఆడియో సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.అలాగే బిల్ట్ ఇన్ పవర్‌ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. అలాగే డ్యూయెల్ హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఏయూఎక్స్ ఔట్‌పుట్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి. 30 వేల గంటల పాటు ప్రొజెక్టర్ ల్యాంప్ పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్ నుంచి మీరాకాస్ట్ ఫీచర్‌తో ఈ ప్రొజెక్టర్‌పై నచ్చిన సినిమాలు చూడవచ్చు. ఈ ప్రొజెక్టర్ లో బిల్ట్ ఇన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది.

Zeb Pixaplay 17 smart LED Tv 224 inch screen for only 24 thousand

Zeb Pixaplay 17 smart LED Tv 224 inch screen for only 24 thousand

32 జీబీ రామ్ ఉంటుంది. యాప్ డౌన్‌లోడ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అలాగే అదనపు స్పీకర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్యూయెల్ బాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.1 ఫీచర్ కూడా ఉంది. అంటే స్పీకర్లను ఈజీగానే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రొజెక్టర్ కొనే వారికి హ్యాండీ బ్యాక్‌ప్యాక్ కూడా లభిస్తుంది. దీని ద్వారా మీరు ప్రొజెక్టర్‌ను స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా తీసుకెళ్లచ్చు. ఇకపోతే ఈ ప్రాజెక్టు చిన్న ఇళ్లలో సరిపోదు ప్రత్యేకంగా ఒక గది ఉండాల్సిందే. అలాగే అదనపు స్పీకర్లు కొంటే దానికి సౌండ్ సిస్టం ఉంటే బాగుంటుంది. అందుకే అన్ని ఆలోచించిన తర్వాత ఈ ప్రాజెక్టర్ ని కొనుగోలు చేయడం మంచిది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది