Categories: NewsTelangana

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ సర్కార్ మరో భారీ శుభవార్త

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద పేదలకు గృహాలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్ని కీలక మార్గదర్శకాలను ప్రకటించారు. ప్రభుత్వం అందించే మంజూరు బిల్లులు పొందాలంటే, నిర్మాణం తప్పనిసరిగా 400 చదరపు అడుగులకు మించకుండా, గరిష్టంగా 600 చదరపు అడుగుల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ నిబంధన అని, దీనిని అతిక్రమించే వారికి బిల్లులు నిలిపివేయబడతాయని మంత్రి హెచ్చరించారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ సర్కార్ మరో భారీ శుభవార్త

Indiramma Housing Scheme : అలాంటివారికి లక్ష అందిస్తామని తెలిపిన మంత్రి పొంగులేటి

ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో ప్రారంభించామని, ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నమూనా నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అయితే కొందరు లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలపై అవగాహన లేకుండా 600 చదరపు అడుగులకంటే పెద్ద ఇళ్లు నిర్మించడం ప్రారంభించారని వెల్లడించారు. అలాంటి ఇళ్లకు తాత్కాలికంగా బిల్లులు ఆపివేసినప్పటికీ, బేస్‌మెంట్ దశ వరకూ పూర్తైన ఇళ్లకు ఒక్కసారి మాత్రమే ప్రత్యేక మినహాయింపు కల్పించి, రూ. లక్ష చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై మాత్రం కఠినంగా నిబంధనలు అమలవుతాయని ఆయన చెప్పారు.

ఈ పథకం అమలులో పారదర్శకత కోసం నాలుగు దశల్లో బిల్లులు చెల్లించనున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సహాయంతో నిర్మాణాలను ట్రాక్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి సోమవారం అర్హులైనవారికి బిల్లులు జమవుతాయని చెప్పారు. అలాగే ఎవరు సిఫార్సులు చేసినా పనులు పూర్తవ్వకపోతే బిల్లులు మంజూరు చేయవద్దని ఇంజినీర్లకు ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతపై న్యాక్ శిక్షణ పొందిన ఇంజినీర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఏవైనా తప్పులుంటే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పథకం విజయవంతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని మంత్రి సూచించారు.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

9 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

12 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

16 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

19 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

21 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

2 days ago