KCR Defeat : కేసీఆర్ ఓడిపోయింది అందుకే.. ఈ జ్యోతిష్యుడి మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. కేసీఆర్ అలా ఎందుకు చేసినట్టు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR Defeat : కేసీఆర్ ఓడిపోయింది అందుకే.. ఈ జ్యోతిష్యుడి మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. కేసీఆర్ అలా ఎందుకు చేసినట్టు?

 Authored By kranthi | The Telugu News | Updated on :5 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  కేసీఆర్ జాతకంలో రాజయోగం ఎందుకు స్థంభించిపోయింది?

  •  గురువులను కేసీఆర్ నిందించారా?

  •  గురువుల శాపమే కేసీఆర్ కు తగిలిందా?

KCR Defeat : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నవ శకం ఆరంభమైంది. తెలంగాణలో కేసీఆర్ తర్వాత తొలిసారి రెండో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ వ్యక్తి కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇంకా సీఎం అభ్యర్థిని డిసైడ్ చేయలేదు కానీ.. రెండు మూడు రోజుల్లో సీఎం ప్రమాణ స్వీకారం కూడా జరగనుంది. ఇక.. మరోవైపు తన పార్టీని ఓడగొట్టుకొని, కామారెడ్డిలో ఓడిపోయి కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అయితే.. కేసీఆర్ పరిస్థితి ఇలా జరగడానికి కారణాలు ఏంటి అనేది ప్రముఖ జ్యోతిష్యుడు కృష్ణమాచార్య చెప్పుకొచ్చారు. కేసీఆఱ్ జాతకం స్తంభించింది. ఆయన ఆలోచనలు స్తంభించాయి. ఏదో కారణంగా అందరూ దూరం అవుతున్నారు. అటువంటి ప్రయోగాలు ఏమైనా జరిగి ఉంటే ఈ విధమైన ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే గురుదేవులు చెప్పారు. ప్రత్యేకమైన విధివిధానంలో వారి జాతకంలో గురు సంబంధమైన విషయంలో దోషి యుక్తమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే.. రెండు ప్రధాన అంశాల వల్ల కేసీఆర్ జాతకంలో అద్భుతమైన గ్రహగతులు ఉన్నా ఓడిపోవడం జరిగిందన్నారు.

ఇద్దరు గురుతుల్యులైనటువంటి వ్యక్తులను నిందించడం, లేదా గురుశాపం ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. జాతకంలో దేవగురు బృహస్పతి సరిగ్గా ఉంటే చాలు సర్వ అరిష్టాలు పోతాయి. కానీ.. మన జాతకంలో గురువు సరిగ్గా ఉండటమే కాదు.. గురు స్థానంలో ఉన్న కొందరు మహిమాన్వితమైన వ్యక్తులను మనం నిందించడమో, వాళ్లను ఇబ్బంది కలిగించడమో, అవమాన పరచడమో చేయడం, గురునింద మహా శాపం, మహా పాతకం అని పెద్దలు చెబుతుంటారు. అటువంటి గురునింద చేయడం వల్లనో, గురుశాప సంబంధమైన ఫలితం కారణంగానో, వారి జాతకంలో గురు సంబంధమైన స్థితిగతుల్లో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది. ఏదో గురువులు ఇద్దరు శపించడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చు అని కృష్ణమాచార్య చెప్పుకొచ్చారు. వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఇద్దరు పీఠాధిపతులు, వీరికి సంబంధం ఉన్న స్థితిగతుల్లో కొన్ని ఇలా జరిగి ఉంటాయని తన అభిప్రాయం అని చెప్పారు.

KCR Defeat : రాజయోగ ఫలితాలు కంటే ఇబ్బందులే ఎక్కువ

తాంత్రిక సంబంధమైన విధివిధానాలు జరిగినప్పుడు, రాజశ్యామల, ఇతర యాగాలు చేసినా ఫలితం ఉండదు. జాతకంలో అద్భుతమైన రాజయోగ ఫలితాల కంటే కూడా ఇబ్బందులు కలిగించే స్థితిగతులు ఎక్కువవుతాయి. అనారోగ్యం కూడా బాధిస్తుంది. తాంత్రిక విధానంలో వ్యక్తిగతమైన జాతకంలో తాంత్రిక విధానంలో చేసే అద్భుతమైన క్రతువు చేయాల్సి ఉంటుంది. ఏదో తెలియని స్తంభన వారి జాతకంలో నాకు గోచరిస్తోంది. ఆ యోగాన్ని స్థంభింపచేసిన పరిస్థితులు కారణం అయ్యాయి. ఈ ఇబ్బంది స్థితిలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అనుకూలమైన రాజయోగ ఫలితాలు ఉన్నాయి. సమీపంలో మళ్లీ ఎలాంటి పరిస్థితులు అయినా రావచ్చు.. అని కృష్ణమాచార్య చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది