Kavitha : కవిత.. కాంగ్రెస్ వదిలిన బాణం..!
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లేఖ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా స్పందిస్తూ.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం విశేషం. అయితే బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తుండటం గమనార్హం.
Kavitha : కవిత.. కాంగ్రెస్ వదిలిన బాణం..!
ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్ వదిలిన బాణం” అంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్‌లోని కుటుంబ రాజకీయాలను ఆయన ఓటీటీ ఫ్యామిలీ డ్రామా గా అభివర్ణించారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసి బీజేపీపై విమర్శలు చేయడం అనైతికమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా పేర్కొన్నారు. కుటుంబ పాలనను బీజేపీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోందని ఆయన తేల్చి చెప్పారు.
కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సమస్యలను ప్రజల భావోద్వేగాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించిన బండి సంజయ్, బీజేపీ మాత్రం చట్టానుసారంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కుటుంబ రాజకీయాలకన్నా అభివృద్ధి కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలో లేకపోయినా ప్రజల్లో నమ్మకాన్ని సాధించిందని, సర్వేల్లో తమ పార్టీ గ్రాఫ్ ఎగబాకుతోందని పేర్కొన్నారు. బీజేపీ తీసుకువచ్చే మార్పే తెలంగాణకు అవసరమని తేల్చి చెప్పారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.