Kavitha : కవిత.. కాంగ్రెస్ వదిలిన బాణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kavitha : కవిత.. కాంగ్రెస్ వదిలిన బాణం..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 May 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Kavitha : కవిత.. కాంగ్రెస్ వదిలిన బాణం..!

Kavitha  : తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లేఖ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా స్పందిస్తూ.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం విశేషం. అయితే బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తుండటం గమనార్హం.

Kavitha కవిత కాంగ్రెస్ వదిలిన బాణం

Kavitha : కవిత.. కాంగ్రెస్ వదిలిన బాణం..!

Kavitha  కవిత కాంగ్రెస్ బాణం అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్ వదిలిన బాణం” అంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్‌లోని కుటుంబ రాజకీయాలను ఆయన ఓటీటీ ఫ్యామిలీ డ్రామా గా అభివర్ణించారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసి బీజేపీపై విమర్శలు చేయడం అనైతికమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా పేర్కొన్నారు. కుటుంబ పాలనను బీజేపీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోందని ఆయన తేల్చి చెప్పారు.

కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సమస్యలను ప్రజల భావోద్వేగాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించిన బండి సంజయ్, బీజేపీ మాత్రం చట్టానుసారంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కుటుంబ రాజకీయాలకన్నా అభివృద్ధి కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలో లేకపోయినా ప్రజల్లో నమ్మకాన్ని సాధించిందని, సర్వేల్లో తమ పార్టీ గ్రాఫ్ ఎగబాకుతోందని పేర్కొన్నారు. బీజేపీ తీసుకువచ్చే మార్పే తెలంగాణకు అవసరమని తేల్చి చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది