Barrelakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఎన్నికల ఫలితాలలో ఓటమి పాలయ్యారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే బర్రెలక్క మొదటి రౌండ్లో మొదటి స్థానంలోకి వచ్చినా అన్ని రౌండ్లకు కలిపి 6000 ఓట్లు సంపాదించారు. కానీ లీడ్లోకి రాలేకపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇక ఓటమి పాలైన బర్రెలక్క మీడియాతో ముచ్చటించారు. నాకు ఎన్ని ఓట్లు వచ్చాయని బాధపడనని, ఒక్క రూపాయి ఇవ్వకుండా నామీద చాలా మంది నమ్మకంతో ఓట్లు వేశారు, అందుకు చాలా సంతోషంగానే ఉంది. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయిన గెలుస్తాను అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బర్రెలక్క కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. నాకు చాలామంది ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నించినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఓడిపోయినందుకు నేనేం బాధపడను అని పోరాటం చేస్తూ ఉంటాను అని తెలిపారు. అయితే చాలామంది తనపై అపోహ పెంచుకున్నారని ఆమె తెలిపారు. నేను చాలా నిరుపేద రాలిని అని, ఆమెకే లేనప్పుడు మాకేం సహాయం చేస్తుంది అని అనుకుంటున్నారు.
కానీ నాకు ఏమీ లేకపోవచ్చు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ద్వారా ప్రజలకు సాయం చేయగలను. కానీ అది తెలియక కొందరు ఇలా అపోహ పడుతున్నారు. ఎవరు గెలిచిన నిరుద్యోగం అనేది లేకుండా చేయాలని, కొల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్లు అస్సలు బాగోలేదని, నిరుద్యోగ సమస్య ఎలా ఉందో కొల్లాపూర్ లో రోడ్ల సమస్యల అలా ఉంది, రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని, ముందు రోడ్ల బాగు చేయాలి అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక మొత్తం 119 స్థానాలలో హస్తం గుర్తు 64 సీట్లను దక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో మొత్తం 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు భారీ మెజారిటీతో గెలిచారు.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.