Barrelakka : ఎమ్మెల్యేగా ఓడిపోతేనేం.. ఎంపీగా పోటీ చేస్తా అంటున్నా బర్రెలక్క..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Barrelakka : ఎమ్మెల్యేగా ఓడిపోతేనేం.. ఎంపీగా పోటీ చేస్తా అంటున్నా బర్రెలక్క..!

Barrelakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఎన్నికల ఫలితాలలో ఓటమి పాలయ్యారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే బర్రెలక్క మొదటి రౌండ్లో మొదటి స్థానంలోకి వచ్చినా అన్ని రౌండ్లకు కలిపి 6000 ఓట్లు సంపాదించారు. కానీ లీడ్లోకి రాలేకపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇక ఓటమి పాలైన బర్రెలక్క మీడియాతో ముచ్చటించారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :5 December 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Barrelakka : ఎమ్మెల్యేగా ఓడిపోతేనేం.. ఎంపీగా పోటీ చేస్తా అంటున్నా బర్రెలక్క..!

  •  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క

Barrelakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఎన్నికల ఫలితాలలో ఓటమి పాలయ్యారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే బర్రెలక్క మొదటి రౌండ్లో మొదటి స్థానంలోకి వచ్చినా అన్ని రౌండ్లకు కలిపి 6000 ఓట్లు సంపాదించారు. కానీ లీడ్లోకి రాలేకపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఇక ఓటమి పాలైన బర్రెలక్క మీడియాతో ముచ్చటించారు. నాకు ఎన్ని ఓట్లు వచ్చాయని బాధపడనని, ఒక్క రూపాయి ఇవ్వకుండా నామీద చాలా మంది నమ్మకంతో ఓట్లు వేశారు, అందుకు చాలా సంతోషంగానే ఉంది. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయిన గెలుస్తాను అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బర్రెలక్క కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. నాకు చాలామంది ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నించినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఓడిపోయినందుకు నేనేం బాధపడను అని పోరాటం చేస్తూ ఉంటాను అని తెలిపారు. అయితే చాలామంది తనపై అపోహ పెంచుకున్నారని ఆమె తెలిపారు. నేను చాలా నిరుపేద రాలిని అని, ఆమెకే లేనప్పుడు మాకేం సహాయం చేస్తుంది అని అనుకుంటున్నారు.

కానీ నాకు ఏమీ లేకపోవచ్చు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ద్వారా ప్రజలకు సాయం చేయగలను. కానీ అది తెలియక కొందరు ఇలా అపోహ పడుతున్నారు. ఎవరు గెలిచిన నిరుద్యోగం అనేది లేకుండా చేయాలని, కొల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్లు అస్సలు బాగోలేదని, నిరుద్యోగ సమస్య ఎలా ఉందో కొల్లాపూర్ లో రోడ్ల సమస్యల అలా ఉంది, రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని, ముందు రోడ్ల బాగు చేయాలి అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక మొత్తం 119 స్థానాలలో హస్తం గుర్తు 64 సీట్లను దక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో మొత్తం 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు భారీ మెజారిటీతో గెలిచారు.

anusha

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక