Bhu Bharati : జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు
ప్రధానాంశాలు:
Bhu Bharati : జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత కలిగించేందుకు చేపట్టిన “భూభారతి” చట్టానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో భూభారతి చట్టాన్ని అమలులోకి తేవడంలో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సదస్సుల ద్వారా ప్రజల భూ సంబంధిత సమస్యలను ప్రత్యక్షంగా వినిపించి, వేగంగా పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకుంది.

Bhu Bharati : జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు
ప్రస్తుతం రాష్ట్రంలోని 28 మండలాల్లో ఈ సదస్సులు ఇప్పటికే జరుగుతున్నాయి. మొదటి దశలో నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి ఫలితాలు లభించాయి. ఈ అనుభవాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించేందుకు రెవెన్యూ శాఖ సన్నాహాలు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.
ఈ సదస్సుల ద్వారా జూన్ 30వ తేదీ నాటికి మొత్తం భూ సంబంధిత సమస్యల్లో కనీసం 60 శాతం సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. భూ వివరాల అనుమతులు, రికార్డుల సరైన సవరణ, హక్కుల ధ్రువీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రజలు సదస్సుల్లో చురుకుగా పాల్గొని తమ సమస్యలు అధికారులకు వినిపించాలని ప్రభుత్వం కోరుతోంది.