Gajwel : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ఓటర్లను బతిమిలాడుకుంటున్నారు. తమకే ఓటేయాలంటూ కోరుతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ ఎన్నికల హడావుడే నెలకొన్నది. తెలంగాణలో ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. బీజేపీ పార్టీ అంతగా యాక్టివ్ గా కనిపించకున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో దూసుకుపోతున్నారు. తమదే గెలుపు అంటూ ఎవరికి వాళ్లే చెప్పుకుంటున్నారు. కొన్ని సర్వే సంస్థలు మాత్రం బీఆర్ఎస్ వైపు ఉండగా.. మరికొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపు ఉన్నాయి. అయితే.. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం హాట్ టాపిక్ గా నిలిచాయి. అందులో గజ్వేల్ నియోజకవర్గం ఒకటి. గజ్వేల్ అనగానే మనకు గుర్తొచ్చేది గులాబీ అధినేత సీఎం కేసీఆర్. ఆయన సొంత నియోజకవర్గం అది. ఆయన గ్రామం చింతమడక కూడా అదే నియోజకవర్గంలో ఉంది.
గజ్వేల్ లో కేసీఆర్ ఇప్పటి వవరకు చాలాసార్లు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటారు. గజ్వేల్ లో పోటీ అంటే వార్ వన్ సైడ్ అనే అనుకోవాలి. అక్కడ సీఎం కేసీఆర్ ను కాదని ఎవ్వరు పోటీ చేసినా గెలుపు కాదు కదా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. అయితే.. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కారు పార్టీ అధినేత కేసీఆర్ కు ఎన్నికలకు ముందే షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి గజ్వేల్ నుంచి 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు నిలిచారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
జిల్లాలో రికార్డు స్థాయిలో నామినేషన్లు నమోదు చేయడం, అందులోనూ కేవలం గజ్వేల్ నుంచే 44 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో అది కేసీఆర్ కు కొంత మైనస్ అనే చెప్పుకోవాలి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో వీరి మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. కానీ.. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించేందుకే, కావాలనే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి.. కనీసం ఈసారైనా గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించే సత్తా ఎవరికైనా ఉందా? అనేది వేచి చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.