
australia cricketer mitchell marsh rests his feet on world cup trophy
Mitchell Marsh : ఎంత దారుణం అంటే.. అసలు ఒక ట్రోఫీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా. ప్రపంచ కప్ ట్రోఫీ అది. దాని మీద కాళ్లు పెట్టి ఇలా ప్రవర్తించడం అనేది ఎంత వరకు కరెక్ట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూసి నెటిజన్లు అయితే తెగ ఫైర్ అవుతున్నారు. చీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ల బుద్ధి మారదా ఇక. ఎక్కువ కప్పులు కొట్టామని.. ఎక్కువసార్లు ట్రోఫీ గెలిచామనే ఓవర్ కాన్ఫిడెన్సా? లేక బలుపా? ట్రోఫీ విలువ తెలియని వాళ్లను అసలు ప్రపంచ కప్ లోనే తీసుకోవద్దు అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆ ఫోటోపై ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలుసు కదా. ఆ కప్పును ఆస్ట్రేలియా క్రికెటర్లకు అందజేసిన తర్వాత ఆ కప్పును తీసుకొని ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ హోటల్ కు వెళ్లారు. అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కప్పును కింద పెట్టారు.
ట్రోఫీని కింద పెట్టి అవమానించడమే కాకుండా.. ఆ ట్రోఫీపై ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టాడు. బీరు తాగుతూ దాని మీద కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులిచ్చాడు మార్ష్. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు అవమానించింది కేవలం ట్రోఫీని మాత్రమే కాదు.. వరల్డ్ కప్ ను, ఐసీసీనే అవమానించారు అని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు వరల్డ్ కప్ గెలిచినా ఆస్ట్రేలియా తీరు మాత్రం మారడం లేదు. 2006 లోనూ ఆస్ట్రేలియా కప్పు గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ తో వాగ్వాదానికి దిగారు. ట్రోఫీ తీసుకునే సమయంలో అమర్యాదగా ప్రవర్తించారు.
క్రికెట్ లో తమను కొట్టేవాడు లేడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లలో నాటుకుపోయింది. అందుకే వరల్డ్ కప్ ట్రోఫీ మీద కనీసం గౌరవం లేకుండా దాని మీద కాళ్లు పెట్టడం, దాన్ని కింద పెట్టి అవమానించడం చేస్తున్నారు. 2006 లోనూ అదే చేశారు. ఇప్పుడు 2023 లోనూ అదే చేశారు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.