KCR : రాజకీయాలకు కేసీఆర్ గుబ్ బై? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : రాజకీయాలకు కేసీఆర్ గుబ్ బై?

KCR కేసీఆర్ ఏంటి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏంటి? మతిపోయిందా మీకు అని అనకండి.. అసలు విషయం ఏంటో పూర్తిగా చదవండి. బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నమాటలు అవి. ఆమెకు కేసీఆర్ అంటే ఎంత కోపమో అందరికీ తెలుసు. బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన విజయశాంతి.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్నింట్లో విఫలమయ్యారు. మహిళల భద్రత కోసం చట్టాలను సరిగ్గా అమలు చేయడం కూడా వీళ్లకు చేతకావడం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 January 2021,4:34 pm

KCR కేసీఆర్ ఏంటి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏంటి? మతిపోయిందా మీకు అని అనకండి.. అసలు విషయం ఏంటో పూర్తిగా చదవండి. బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నమాటలు అవి. ఆమెకు కేసీఆర్ అంటే ఎంత కోపమో అందరికీ తెలుసు. బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన విజయశాంతి.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

bjp leader vijayashanthi sensational comments on telangana cm kcr

bjp leader vijayashanthi sensational comments on telangana cm kcr

సీఎం కేసీఆర్ అన్నింట్లో విఫలమయ్యారు. మహిళల భద్రత కోసం చట్టాలను సరిగ్గా అమలు చేయడం కూడా వీళ్లకు చేతకావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం రౌడీలే. కేసీఆర్ కంటే ఎక్కువ బూతులు వాళ్లే మాట్లాడుతున్నారు. బీజేపీని చించేయాలట. ఏం చించేస్తరు. కరోనా వాక్సిన్ రాష్ట్రానికి వచ్చినా.. ఫాంహౌస్ నుంచి బయటకు కదలని ముఖ్యమంత్రి ఆయన. ప్రజలకు ధైర్యం చెప్పలేని ముఖ్యమంత్రి. బహుశా ఆయన రాజకీయాలు వదిలేసి ఉంటారు. ఫాంహౌస్ కే పరిమితం అయ్యారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు కాబట్టే రాష్ట్రాన్ని పట్టించుకోవడం మానేశారు.. అంటూ విజయశాంతి దుయ్యబట్టారు.

bjp leader vijayashanthi sensational comments on telangana cm kcr

bjp leader vijayashanthi sensational comments on telangana cm kcr

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కేసీఆర్ ?

ముఖ్యమంత్రి దగ్గర్నుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ తెలంగాణను భ్రష్టు పట్టించారు. ప్రజల ముందే వీళ్లందరినీ దోషులుగా నిలబెడతాం. బీజేపీ అధికారంలోకి రావడమే ఆలస్యం.. తెలంగాణ మొత్తం మారిపోతుంది. తెలంగాణలో మరోసారి ఉద్యమం రావాల్సిందే. తెలంగాణ ప్రజలంతా ఏకమై కేసీఆర్ పాలనను అంతమొందించాలి. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది.. అని విజయశాంతి స్పష్టం చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది