TKGKS Maha Dharna  : మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 March 2026, 6:17 pm
  •  TKGKS Maha Dharna  : మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా

TKGKS Maha Dharna  : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 17న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం ( కేజీకేఎస్ ) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి గీత కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకావాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమ కార్యక్రమాల కోసం కనీసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.70 కోట్లు ఇంకా పూర్తిగా వినియోగించలేదని, ఆ నిధులను ఈ మార్చి నెలలోనే విడుదల చేసి ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 17న సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర కార్యవర్గం నిరాహార దీక్ష నిర్వహించినట్లు నాయకులు గుర్తు చేశారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కార్మికుల సమస్యలను వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వృత్తికి సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కరించడంలో మంత్రి సహకరించారని సంఘం నాయకులు తెలిపారు.పెండింగ్‌లో ఉన్న ఎక్సిగ్రేషియా నుంచి రూ.3 కోట్లు తక్షణమే విడుదల చేయడం జరిగిందని, మిగిలిన రూ.11 కోట్లు కూడా త్వరలో ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే నీరా కేఫ్‌లను తిరిగి ప్రారంభించేందుకు టెండర్ ప్రక్రియను మొదలుపెట్టారని, గీత కార్మికుల భద్రత కోసం కాటమయ్య రక్షణ కవచం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు.

TKGKS Maha Dharna  : మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా

TKGKS Maha Dharna : మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా..!

వృత్తిలో ఉన్న ప్రతి కార్మికుడికి ఈ రక్షణ పరికరాలు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయని సంఘం నాయకులు పేర్కొన్నారు. సభ్యులందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించడం, కొత్త కార్మికులకు పెన్షన్ అమలు చేయడం, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.4 వేలుగా పెంచడం, ఎక్సిగ్రేషియా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచడం వంటి హామీలు ఇంకా అమలు కాలేదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న గీత కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మిగిలిన అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇతర వృత్తి సంఘాలతో కలిసి మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని గీత కార్మికులు, శ్రేయోభిలాషులు వేలాదిగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని యం.వి.రమణ, రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి