Fine Rice : సన్నబియ్యం పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే !
ప్రధానాంశాలు:
Fine Rice : సన్నబియ్యం పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే !
Fine Rice : హైదరాబాద్ ఖైరతాబాద్ సర్కిల్-7 పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది. ప్రతి నెలా కార్డుదారులకు అందజేయాల్సిన సన్నబియ్యం ఈనెల 1వ తేదీ నుంచి ఎన్నికల నియమావళి (కోడ్) కారణంగా నిలిపివేశారు. ఉగాది కానుకగా ఒక్కో కుటుంబానికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించాల్సి ఉండగా, కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వం తాత్కాలికంగా దీనిని నిలిపివేసింది. దీంతో సర్కిల్-7 పరిధిలోని రూ.2,95,779 మంది రేషన్ కార్డుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Fine Rice : సన్నబియ్యం పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే !
Fine Rice : ఖైరతాబాద్ సర్కిల్లో సన్నబియ్యం పంపిణీకి బ్రేక్
ఎన్నికల నియమావళి నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ నెల కోటా కింద సన్నబియ్యం కాకుండా, దొడ్డి బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. అధికారుల ఆదేశాల ప్రకారం..రేషన్ డిపోలలో సన్నబియ్యం బస్తాలను ఒక మూలన పెట్టాలని, వాణిజ్యుల ద్వారా కార్డుదారులకు దొడ్డి బియ్యాన్ని అందించాలని సూచించారు. దీనితో ప్రజలకు తక్కువ నాణ్యత కలిగిన బియ్యం మాత్రమే అందుతుందని, ఇది అనేక కుటుంబాలకు అసంతృప్తిని కలిగించిందని కార్డుదారులు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏప్రిల్ 29 వరకు అమలులో ఉండటంతో మే నెల నుంచి మళ్లీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తాత్కాలికంగా నిలిపివేయబడటం వల్ల రేషన్ కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల ప్రకటన ప్రకారం, ఎన్నికలు ముగిసిన వెంటనే సన్నబియ్యం పంపిణీ పునఃప్రారంభం కానుందని తెలియజేశారు.