Padi Kaushik Reddy : ఓటు వేయకపోతే హుజురాబాద్ లో మూడు శవాలు లేస్తాయి.. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ..!
Padi Kaushik Reddy : తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు (నవంబర్ 28) ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చివరి ప్రచారం నిర్వహించిన హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ. . ప్రచారం అయితే చేసాను. ఇక మీ ఇష్టం. నాకు ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూడండి. మీరు ఓటు వేసిన నన్ను గెలిపిస్తే జయయాత్రకు వస్తా, లేదంటే నాలుగో తారీఖున నా శవయాత్రకు మీరు రండి. మీకు దండం పెడతా, మీ కాళ్లు పట్టుకుంటా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ప్రచారంలో తన భార్య బిడ్డలతో నిర్విరామంగా ప్రచారం చేశారు. ఇక చివరి రోజు ఈ వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా మారారు. ఇక కౌశిక్ రెడ్డి తరఫున తన కూతురు శ్రీనిక చేసిన ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది. హుజురాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో శ్రీనిక తన తండ్రిని గెలిపించాలని, తన తండ్రిని గెలిపిస్తే హుజురాబాద్ కి రెండు వేల కోట్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే హుజూరాబాద్ నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో ఉండటం గమనార్హం.
మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసి పాడి కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. అయితే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇది కూడా ఒక రకంగా ఓటర్లను ప్రలోభ పెట్టినట్లే అవుతుందని, ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న కౌశిక్ రెడ్డి పై ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఈరోజు ముగియనుండడంతో అభ్యర్థులు ఎమోషనల్ అవడం సహజమే. కానీ కౌశిక్ రెడ్డి కొంచెం ఎక్కువ భావోద్వేగానికి గురయ్యారు.
ఇప్పుడు హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మంత్రిగాను చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాల కారణంగా బీజేపీ లోకి వచ్చి చేరారు. అన్ని పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి టికెట్ ఆశించినా దక్కలేదు. ఈ సారి బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తాను ఎలాగైనా గెలవాలని పాడి కౌశిక్ రెడ్డి అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రచారంలో బాగా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.