Mulugu Seethakka : ములుగులో సీతక్క విజయాన్ని ఫిక్స్ చేసిన బీఆర్ఎస్
Mulugu Seethakka : సీతక్క అంటేనే ఒక బ్రాండ్. ఆమె కేవలం ములుగు జిల్లా ఎమ్మెల్యే మాత్రమే కావచ్చు కానీ.. ఆమె తెలంగాణలోనే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. ఆమె గురించి తెలంగాణ మొత్తం తెలుసు. దానికి కారణం.. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆమె పనిచేయడం. వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు ఆమె. అస్సలు తాను ఎమ్మెల్యేను అని కూడా ఆలోచించరు. ఎవరైనా సరే.. ఎవరికి సాయం కావాలన్నా క్షణాల్లో అక్కడికి వెళ్తారు. అందుకే నియోజకవర్గం వ్యాప్తంగా సీతక్క అంటే అంత రేంజ్ ఉంది. ఆమెకు ప్రత్యర్థిగా ఎవరు నిలబడ్డా సరే.. ఎదుటివాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే ఆమె గెలుపు అనేది ఫిక్స్ అయినట్టే.
కానీ.. బీఆర్ఎస్ నుంచి సీతక్కకు పోటీగా నాగాజ్యోతిని బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి సీతక్క ఫిక్స్ కాగా.. బీఆర్ఎస్ నుంచి నాగజ్యోతిని బరిలోకి దించారు. అయితే.. నాగజ్యోతి ప్రస్తుతం ములుగు జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ.. అనూహ్యంగా ములుగు నుంచి తన పేరు ప్రకటించడంతో ఆమె చాలా సంతోషించారు. అయితే.. ఆమె పేరును ప్రకటించడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆమెకు కూడా నక్సలిజం నేపథ్యమే ఉంది. ఆమె తండ్రి, తల్లి ఇద్దరూ నక్సలిజంతో తిరిగారు. సీతక్కది కూడా నక్సలిజం నేపథ్యమే. ఇద్దరిదీ ఒకే బ్యాక్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి.ములుగుకు చెందిన బీఆర్ఎస్ నేత చందూలాల్ కొడుకు ప్రహ్లాద్ బీఆర్ఎస్ టికెట్ ను ఆశించారు కానీ.. ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర నిరాశకు లోనయినట్టు తెలుస్తోంది.
Mulugu Seethakka : ప్రహ్లాద్ ని కాదని జ్యోతికి టికెట్ ఎందుకు ఇచ్చినట్టు?
అందుకే.. బీజేపీ నుంచి టికెట్ ఇస్తామన్న హామీ వస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలు కూడా అజ్మీరా ప్రహ్లాద్ కు బీజేపీ నుంచి టికెట్ ఇచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రహ్లాద్ బీజేపీలో చేరితే ములుగులో బీఆర్ఎస్ ఓట్లు చీలుతాయి. దాని వల్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచే చాన్స్ తగ్గిపోతుంది. అది సీతక్కకే ప్లస్ అవుతుంది. సీతక్క గెలుపు మళ్లీ ఖాయం అయినట్టే అనే సంకేతాలు ప్రస్తుతం ములుగులో కనిపిస్తున్నాయి.