BRS BJP : తెలంగాణాలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు NDA ప్రభుత్వాన్ని.. బీజేపె పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడిన బిఆర్ఎస్ అధినేత కేసి ఆర్ ఇప్పుడు ఆయన అన్న మాటలన్నిటినీ మర్చిపోయి బీజేపీతో స్నేహానికి చేయి చాచినట్టు తెలుస్తుంది. తెలంగాణా సీఎం గా ఉన్నప్పుడు బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతాం.. మోడీ ఒక దొంగ.. ఆయనకు పాలన అస్సలు చేతకాదు అన్న కే.సీ.ఆర్ తెలంగాణాలో ఓడిన తర్వాత పార్టీ పరిస్థితి మారడంతో నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుది. బీజేపీకి తమ నలుగురి రాజ్యసభ సభ్యుల ఎంపీల సపోర్ట్ అందించి వారితో స్నేహం చేయాలని చూస్తున్నారు కే.సీ.ఆర్. ఓ పక్క లిక్కర్ స్కాం లో కవిత ఐదు నెలలుగా జైల్లో ఉంది. మరోపక్క తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఛాన్స్ దొరికితే చాలు కేసీఆర్, కేటీఆర్ లను కూడా జైలుకి పంపించేలా ఉన్నారు.
ఈ టైం లో బీజేపీ అయితేనే తనని తన పార్టీని కాపాడగలదని కేసీఆర్ నమ్ముతున్నారు. అందుకే తమ రాజ్య సభ ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, పార్ధ సారధిరెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డిలను బీజేపీ కోసం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు కే సీ ఆర్. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలతో మట్లాడుతున్నారని తెలుస్తుంది. ఐతే కేసీఆర్ ఇచ్చిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరితే ఆయన ప్రయత్నాలు ఫలించినట్టే అవుతుంది. ఓ పక్క తెలంగాణాలో తమ బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇది కలిసి వస్తుంది. ఐతే ఈ స్నేహం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఉంటే అప్పటి పరిస్థితులను బట్టి సీట్ల పంపకం ఉంటుందని చెప్పొచ్చు.ఏది ఏమైనా కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో సఖ్యత ఉంటేనే బిఆర్ఎస్ పార్టీ మంగడ ఉంటుందని భావిస్తున్నారు.
తెలంగాణాలో బిఆర్ఎస్ తో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. ఒక్కసారిగా బిఆర్ఎస్ ఖాళీ అవుతుంది. ఈ టైం లో బీజేపీతో ఫ్రెండ్ షిప్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు కేసీఆర్.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.