BRS BJP : బీజేపీతో బిఆర్ఎస్.. తెరవెనుక మంతనాలు మొదలు.. రెండు నెలల్లో జరిగేది ఇదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BRS BJP : బీజేపీతో బిఆర్ఎస్.. తెరవెనుక మంతనాలు మొదలు.. రెండు నెలల్లో జరిగేది ఇదేనా..?

BRS BJP : తెలంగాణాలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు NDA ప్రభుత్వాన్ని.. బీజేపె పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడిన బిఆర్ఎస్ అధినేత కేసి ఆర్ ఇప్పుడు ఆయన అన్న మాటలన్నిటినీ మర్చిపోయి బీజేపీతో స్నేహానికి చేయి చాచినట్టు తెలుస్తుంది. తెలంగాణా సీఎం గా ఉన్నప్పుడు బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతాం.. మోడీ ఒక దొంగ.. ఆయనకు పాలన అస్సలు చేతకాదు అన్న కే.సీ.ఆర్ తెలంగాణాలో ఓడిన తర్వాత పార్టీ పరిస్థితి మారడంతో నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  BRS BJP : బీజేపీతో బిఆర్ఎస్.. తెరవెనుక మంతనాలు మొదలు.. రెండు నెలల్లో జరిగేది ఇదేనా..?

BRS BJP : తెలంగాణాలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు NDA ప్రభుత్వాన్ని.. బీజేపె పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడిన బిఆర్ఎస్ అధినేత కేసి ఆర్ ఇప్పుడు ఆయన అన్న మాటలన్నిటినీ మర్చిపోయి బీజేపీతో స్నేహానికి చేయి చాచినట్టు తెలుస్తుంది. తెలంగాణా సీఎం గా ఉన్నప్పుడు బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతాం.. మోడీ ఒక దొంగ.. ఆయనకు పాలన అస్సలు చేతకాదు అన్న కే.సీ.ఆర్ తెలంగాణాలో ఓడిన తర్వాత పార్టీ పరిస్థితి మారడంతో నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుది. బీజేపీకి తమ నలుగురి రాజ్యసభ సభ్యుల ఎంపీల సపోర్ట్ అందించి వారితో స్నేహం చేయాలని చూస్తున్నారు కే.సీ.ఆర్. ఓ పక్క లిక్కర్ స్కాం లో కవిత ఐదు నెలలుగా జైల్లో ఉంది. మరోపక్క తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఛాన్స్ దొరికితే చాలు కేసీఆర్, కేటీఆర్ లను కూడా జైలుకి పంపించేలా ఉన్నారు.

BRS BJP కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో చర్చలు

ఈ టైం లో బీజేపీ అయితేనే తనని తన పార్టీని కాపాడగలదని కేసీఆర్ నమ్ముతున్నారు. అందుకే తమ రాజ్య సభ ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, పార్ధ సారధిరెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డిలను బీజేపీ కోసం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు కే సీ ఆర్. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలతో మట్లాడుతున్నారని తెలుస్తుంది. ఐతే కేసీఆర్ ఇచ్చిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరితే ఆయన ప్రయత్నాలు ఫలించినట్టే అవుతుంది. ఓ పక్క తెలంగాణాలో తమ బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇది కలిసి వస్తుంది. ఐతే ఈ స్నేహం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఉంటే అప్పటి పరిస్థితులను బట్టి సీట్ల పంపకం ఉంటుందని చెప్పొచ్చు.ఏది ఏమైనా కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో సఖ్యత ఉంటేనే బిఆర్ఎస్ పార్టీ మంగడ ఉంటుందని భావిస్తున్నారు.

BRS BJP బీజేపీతో బిఆర్ఎస్ తెరవెనుక మంతనాలు మొదలు రెండు నెలల్లో జరిగేది ఇదేనా

BRS BJP : బీజేపీతో బిఆర్ఎస్.. తెరవెనుక మంతనాలు మొదలు.. రెండు నెలల్లో జరిగేది ఇదేనా..?

తెలంగాణాలో బిఆర్ఎస్ తో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. ఒక్కసారిగా బిఆర్ఎస్ ఖాళీ అవుతుంది. ఈ టైం లో బీజేపీతో ఫ్రెండ్ షిప్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు కేసీఆర్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది