Chilkur Balaji : చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడిపై 20 మంది దాడి.. అసలు ఏం జరుగుతుంది..!
ప్రధానాంశాలు:
Chilkur Balaji : చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడిపై 20 మంది దాడి.. అసలు ఏం జరుగుతుంది..!
Chilkur Balaji : హైదరాబాద్ Hyderabad లోని మొయినాబాద్ లో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయం Chilkur Balaji temple ఎంత పేరు ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలయాన్ని ప్రతిరోజు వేలాదిగా భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వీసా బాలాజీగా చెప్తుంటారు. ఇక్కడి స్వామివారిని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు.ఇక్కడికి భారీగా తరలివచ్చి.. ప్రదక్షిణలు చేసి తమకు వీసా తొందరగా రావాలని మొక్కులు మొక్కుకుంటారు. చాలా ఫేమస్ ఆలయంగా పేరు తెచ్చుకున్నఈ ఆలయ ప్రధాన పూజారీ రంగ సౌందర రాజన్ పై కొంత మంది దాడులు చేశారు.

Chilkur Balaji : చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడిపై 20 మంది దాడి.. అసలు ఏం జరుగుతుంది..!
Chilkur Balaji దారుణం..
వీరంతా ఇక్ష్వాకు వారసులమని చెప్పుకున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ Chilukuru Balaji Temple ప్రధాన అర్చకుడు రంగరాజన్ Rangarajan కుటుంబంపై దాడి జరిగింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు హిందూ సంస్థ పేరుతో పూజారి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ MV Soundar Rajan పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగరాజన్ Rangarajan, అతని కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి మూడ్రోజులు కాగా తాజాగా వెలుగులోకి వచ్చింది.దాదాపు 20 మంది ఇక్ష్వాకుల వారసులమంటూ వచ్చి రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరగా నిరాకరించడంతో తనతో పాటు కుమారుడిపై దాడి చేసారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోందని మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.